ఆనం సోదరులు పచ్చ కండువా అయితే కప్పుకున్నారు కానీ అంత సులభంగా నెల్లూరు జిల్లాలోని టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలవలేకపోతున్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత కాలం టీడీపీ నేతలు, కార్యకర్తలను ఆనం బృందం పెట్టిన ఇబ్బందులను వారు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. దీంతో వారిద్దరితో కలిసి పనిచేయడం మా వల్ల కాదంటూ కరాఖండీగా తేల్చిచెప్పేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆనం వివేకా కూడా ఏం మాట్లాడుతున్నానో ఆలోచించకుండా మైకు దొరికింది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడి కార్యకర్తలకు మరింత ఆగ్రహం తెప్పిస్తున్నారు.
ఆనం సోదరులు టీడీపీలో చేరి రెండు రోజులైనా కాకముందే నెల్లూరు తెలుగు తమ్ముళ్లు రచ్చ మొదలుపెట్టారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడే చెప్పినా కూడా వారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. పార్టీలో చేరిన రోజే వివేకా వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడని అనడంతో వారంతా మండిపడుతున్నారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నెల్లూరు టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర వద్దకు వచ్చిన నెల్లూరు, ఆత్మకూరు నియోజవర్గ నేతలు ఆనం సోదరుల తీరుపై అప్పుడే ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా తమపై తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేసిన ఆనం సోదరులకు సహకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తామంతా ఇంతకాలం వైఎస్ రాక్షసుడు అని తిడుతుంటే పార్టీలో చేరిన తొలిరోజే వైఎస్ దేవుడని వివేకా ఎలా అంటారని వారు ప్రశ్నించారు. వారిని సముదాయించడం సోమిరెడ్డికి చాలా కష్టమైపోయింది. చివరకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనం బ్రదర్స్‌కు సహకరించబోమని తేల్చేసి వెళ్లారు లోకల్ నేతలు. కానీ ఆనం సోదరులు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వర్షం అన్నట్లుగా ఉన్నారు. చంద్రబాబు తీసుకున్నారు కదా కార్యకర్తలేం చేస్తారులే అన్నట్లుగా ఉన్నారు. ఏం చేస్తారో ఎలక్షన్లు వస్తే కానీ తెలియదు.