నేతాజీ చనిపోలేదు.. దారుణంగా చంపేశారా?

Update: 2017-01-07 04:48 GMT
స్వాతంత్ర్య సమరయోథుడు.. భారతావనిలోని ప్రతి భారతీయుడు ఎంతో గొప్పగా ఫీలయ్యే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సరికొత్త అంశం ఒకటి తెరపైకి వచ్చింది. ఆయనకు సంబంధించిన చాలా అంశాలు మిస్టరీగా కనిపిస్తాయి. తాజా ఉదంతంలోనూ ఇలాంటి పరిస్థితే. ఆయన విమాన ప్రమాదంలో మరణించారని చెబుతున్నా.. అదేం నిజం కాదని.. చాలాకాలం ఆయన బతికే ఉన్నారని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయన బాబా రూపంలో రహస్య జీవితాన్ని గడిపినట్లుగా భారీ ఎత్తున కథనాలు వినిపిస్తుంటాయి.

అయితే.. ఇలాంటి కథనాల్లో నిజం లేదని.. ఆయన విమానప్రమాదంలో మరణించినట్లుగా ఇప్పటివరకూ విడుదలైన రహస్య పత్రాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రిటైర్డ్ మేజర్ జనరల్ జేడీ బక్షి రాసిన ‘‘బోస్ – ది ఇండియన్ సమురాయ్’’ పుస్తకంలో సంచలనాత్మక అంశాలు బయటకు వచ్చాయి. తాజా పుస్తకంలో బోస్.. విమాన ప్రమాదంలో మరణించలేదని.. సోవియట్ యూనియన్ లోని బ్రిటీష్ అధికారుల ఇంటరాగేషన్ లో పెట్టిన చిత్రహింసల కారణంగా మృతి చెందినట్లుగా కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు.

జపాన్ నుంచి తప్పించుకొని సైబీరియాకు వెళ్లిన నేతాజీ అక్కడ అజాద్హింద్ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని.. నేతాజీ తప్పించుకున్న విషయాన్ని బ్రిటీష్ అధికారులు.. ఆయన్ను అప్పగించాలన్న ఒత్తిడిని సోవియెట్ యూనియన్ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లుగా చెప్పారు. ఇదే సమయంలో గతంలో పలుమార్లు బయటకు వచ్చిన ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలు విడుదలైన పక్షంలో భారత్ – సోవియెట్ యూనియన్ల మధ్య సంబంధాలు తీవ్ర ప్రభావితం అవుతాయన్న మాట వినిపించింది. మరి.. ఈ మాటకు తాజాగా బక్షీ చెబుతున్న మాటలకు లింకు ఉన్నట్లేనా..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News