ఇటీవల కాలంలో ప్రపంచానికి అనుభవంలోకి లేని ఎన్నో విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న వేళ.. ఊహకు అందని పరిణామాలే కాదు.. ప్రజలు చెప్పుకోలేని సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి మీడియాలో కథనాలు రావటం మామూలే. అయితే.. ఒక ప్రత్యేక సమస్యకు సంబంధించి మీడియాలో వచ్చిన ఒక కథనానికి స్పందించి ఒక దేశం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మాయదారి రోగం ప్రపంచంతో పాటు యూరప్ లోనూ వ్యాపించిన సంగతి తెలిసిందే.
అలా ప్రభావితమైన దేశాల్లో ఒకటి నెదర్లాండ్స్. ఈ అందమైన దేశం మాయదారి వైరస్ పుణ్యమా అని ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. లాక్ డౌన్ వేళ.. ఒంటరిగా ఉంటున్న పురుషులు.. మహిళలు ఇంటి గడప దాటకుండా ఉండటంతో లైంగిక సుఖానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై హె ట్ పరూల్ అనే మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.
నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒంటరిగా జీవించే వారిని పట్టించుకోవటం లేదని విమర్శించింది. సెక్సు కూడా మానవ హక్కు. ఆడ.. మగ సన్నిహితంగా మెలగటం విలాసవంతమైన విషయం కాదు. అది కూడా ఒక కనీస అవసరంగా పేర్కొందా సంస్థ. దీంతో.. దేశంలో ఒంటరిగా జీవించే పురుషులు కానీ మహిళలు కానీ ఒకేఇంట్లో ఉంటూ లైంగిక సంబంధాన్ని సాగించొచ్చని పేర్కొంది. అయితే.. నిబంధనల్ని పాటించాలని పేర్కొంది.
కొత్తగా జత కట్టిన వారు.. ఒకే ఇంట్లో ఉండే సమయంలో తొలి 14 రోజులు భౌతిక దూరం పాటించాలని.. ఆ తర్వాత వారిద్దరూ లైంగిక సంబంధాన్ని సాగించొచ్చని చెప్పింది. తాముచెప్పిన రెండు వారాల సమయంలో ఎవరిలోనైనా మాయదారి రోగానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే మాత్రం వారిద్దరి మధ్య సెక్సుఅనుబంధం అస్సలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఇలా ఒక వార్తా కథనానికి స్పందించి ప్రభుత్వం అంత పెద్ద నిర్ణయం తీసుకోవటం గమనార్హం.