దక్షిణాది రాష్ట్రాలే కాదు.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నంగా ఉండటమే కాదు.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించే వారి తీరు రోటీన్ కు భిన్నంగా ఉంటుంది. ఎక్కడి దాకానో ఎందుకు? దేశ ప్రధాని నరేంద్ర మోడీని పలువురు ముఖ్యమంత్రులు.. ఇతర ప్రముఖులు భేటీ అవుతుంటారు. ఈ సందర్భంగా వారు ఇరువురు కూర్చునే కుర్చీలు ఒకేలా ఉంటాయి. కానీ.. అందుకు భిన్నమైన సీన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ తమిళనాడు పర్యటనలో భాగంగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా తీసిన ఫోటోను చూస్తే.. ఒక తేడా స్పష్టంగా కనిపించక మానదు.
మిగిలిన వారంతా కూర్చున్న కుర్చీలు ఒకలా.. సీఎం స్టాలిన్ కూర్చున్న కుర్చీ మరోలా ఉండటం గమనార్హం. ఆ మాటకు వస్తే.. తాము కూర్చునే కుర్చీలోనే రాజసాన్ని ప్రదర్శించే తీరు తమిళనాడు ముఖ్యమంత్రులకు ఉందని చెబుతారు. స్వర్గీయ జయలలిత విషయానికి వస్తే.. ఆమె కూర్చునే కుర్చీ గురించి ఆసక్తిగా చెప్పుకోవటమే కాదు.. చివరకు ఆమె ఢిల్లీ వెళ్లినా.. ఆమె కూర్చునే కుర్చీని తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లి.. వేస్తారు. అందులో మాత్రమే ఆమె కూర్చుంటారు. తాము కూర్చునే కుర్చీకి అమ్మ జయలలిత ఇచ్చే ప్రాధాన్యత అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సీఎం స్టాలిన్ తీరు కూడా ఇంచుమించు అలానే ఉందని చెప్పాలి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్నాయి. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా.. స్ఫూర్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన.. ఇలాంటి ముఖ్యమంత్రే మిగిలిన రాష్ట్రాలకు ఉండాలన్న భావన కలిగేలా చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు అంతా కలిసి దిగిన ఫ్యామిలీ ఫోటోను చూసినప్పుడు.. ఆ ఫోటోలో సీఎం స్టాలిన్ తప్పించి.. మిగిలిన వారు కూర్చునే సోఫా సీట్లు ఒకలా ఉంటే.. అందుకు ప్రత్యేకంగా స్టాలిన్ కుర్చీ ఉంది. తాము కూర్చునే కుర్చీలోనే తమ రాజసాన్ని ప్రదర్శించటం తమిళనాడు ముఖ్యమంత్రులకు అలవాటన్న విషయాన్ని స్టాలిన్ మరోసారి నిరూపించారని చెప్పాలి.