చైనాలో పుట్టిన మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా అల్ల కల్లోలం సృష్టిస్తోంది. వివిధ దేశాల్లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఒక్క రోజులోనే 13 లక్షల పైగా కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వివిధ దేశాల్లో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతుంది. అమెరికాలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా... బ్రిటన్లో లక్షలకు పైగా కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు ఉన్నాయి.
మరోవైపు భారతదేశంలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా 37 వేల పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే వైరస్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలను కోరింది. కరోనా వైరస్ రెండో వేవ్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో మరల అటువంటి జాగ్రత్తలు పాటించాలని వివిధ దేశాలకు సూచించింది.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ బ్రెజిల్ లో ఘోర విపత్తు సృష్టిస్తుంది. రెండో వేవ్ అప్పుడు కూడా ఈ దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అంతేకాకుండా మరణాలు కూడా అదే స్థాయిలో వెలుగు చూశాయి. కుప్పలుగా శవాలు కనిపించాయి. కనీసం చనిపోయిన వారిని కాల్చేందుకు స్మశానవాటికలు కూడా ఖాళీ లేనంతగా మరణాలు వైరస్ కారణంగా సంభవించాయి. ఈ సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీస ఆక్సిజన్ దొరకకపోవడంతో చాలా మంది మరణించారు. వీటితో పాటు ఆస్పత్రిలో బెడ్ల కొరత కూడా తీవ్రంగా వేధించింది. ఈ నేపథ్యం లోనే బ్రెజిల్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
అయితే అంతకు ముందు ఆ దేశ అధ్యక్షుడు చేసిన కామెంట్లు ప్రజలలో వైరస్ పై భయాన్ని లేకుండా చేశాయి. ఒక వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్కులు ధరించాలని వివిధ దేశాలకు సూచిస్తూ ఉంటే.. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో మాత్రం మాస్కులు ఉపయోగించాల్సిన అవసరం లేదని అప్పుడు కామెంట్ చేశారు. అనంతరం బ్రెజిల్లో కరోనా వైరస్ మహోత్పతం సృష్టించింది. చాలా మంది ప్రజలు రెండో వేవ్ లో చనిపోయారు. చాలా మంది ఆసుపత్రి బారిన పడ్డారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వీటన్నిటికీ కారణమైన వైరస్ పై ఆ దేశ ప్రజలకు కోపం లేదు! కానీ వైరస్ విజృంభించడానికి దారి తీసిన కారణాల పైనే వారు ఆగ్రహంతో ఉన్నారు! ముఖ్యంగా ఆ సమయంలో అధ్యక్షుడు చేసినా కామెంట్లను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నారు.
ఆ దేశ అధ్యక్షుడు బొల్సొనారో ఇటీవల ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. తాను అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. పొట్టలో పేగుకు సంబంధించిన శస్త్ర చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ దేశ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆయన పై మండిపడ్డారు. ఏకంగా అతనికి చికిత్స నిలిపివేయాలంటూ డాక్టర్లకు సూచించారు.
దేశంలో కోవిడ్ విజృంభించడానికి కారణం అధ్యక్షుడైన... అందుకే అతనికి చికిత్స వెంటనే నిలిపివేయాలని నెటిజన్లు కామెంట్ చేశారు. అధ్యక్షుడు చేసిన కామెంట్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పోస్ట్ కి రిప్లై ఇచ్చారు. ఈ కారణంగా అధ్యక్షుడు కె చికిత్స నిలిపివేయాలని సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా బ్రెజిల్ లో 11 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 23 లక్షలు దాటింది. మరో 72 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య ఆరు లక్షల 19 వేలకు చేరింది.