చివరాఖరుకు ఉద్యోగులే చెడ్డా.. ?
ప్రభుత్వ ఉద్యోగులు అంటే సగటు జనాల్లో ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఉంది. వారికి బ్రహ్మాండమైన జీతాలు కానీ ఎక్కువ మంది అయితే పని మాత్రం అసలు చేయరని, పైగా కొందరు ఉద్యోగులు లంచాలు కూడా మెక్కుతారు, అవినీతి చేస్తారని కూడా సగటు జనంలో ముద్ర పడిపోయిన అభిప్రాయం.
ఇక ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ప్రతీ పైసా కూడా పేదవాడి కష్టార్జితం. వాడి శ్రమదానం, చమటగా ఉంటోంది. అలాంటి సొమ్ములో అగ్ర తాంబూలం ఉద్యోగులకు జీతాల పేరిట పోతోంది అన్న లెక్కలు కూడా జనాలకు తెలుసు.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు వారే చెప్పుకున్నట్లుగా 13 లక్షలు ఉంటే ఏపీలోని అయిదు కోట్ల మందిలో మిగిలిన వారు అంతా చిరుద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, నిరుద్యోగులే కదా అన్న విశ్లేషణ కూడా ఉంది.
ఇక కరోనా వంటి ప్రపంచ మహమ్మారి వచ్చి పడి పేదలను మరింతగా దిగజార్చేసిన వేళ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కసికందలేదు అన్నది తెలిసిందే. వారికి ఉన్న హక్కులు ఎవరూ కాదనడంలేదు. పైగా వారి విషయంలో ఎవరికీ అసూయా ద్వేషాలు కూడా లేవు.
కానీ ఒక వైపు సమాజంలో నూటికి తొంబై శాతం మంది ప్రజానీకం ఆకలితో చాలీచాలని జీతాలతో బతుకులు ఈడుస్తూంటే వారు మాత్రం తమ జీతాలను పెంచమనడం పట్ల అయితే కచ్చితంగా వ్యతిరేకత ఉంది.
ఇదే ఇపుడు అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ కి అందివచ్చిన ఆయుధంగా కనిపిస్తోంది. అందుకే ఫిట్మెంట్ ని ఏకంగా 14. 29 శాతంగా ప్రకటించాలనుకుంటోంది. అదే టైమ్ లో ఇంకా ఎక్కువ కోరితే మాత్రం ప్రభుత్వానికి పెను భారం అంటూ అసలు విషయాలను కూడా చెప్పకనే చెబుతున్నట్లుగా ఉంది.
రూపాయి ఖజానాకు వస్తూంటే అందులో మెజారిటీ వాటా ఉద్యోగుల జీతాలకే పోతోంది అని లెక్కలు కూడా బయటపెడుతున్నారు. ఒకనాడు 52 వేల కోట్ల దాకా అయ్యే ఉద్యోగుల జీతాలు 67 వేల కోట్లకు ఎగబాకడానికి గల కారణాలను కూడా వివరిస్తున్నారు. 9, 10 పీయార్సీలలో ఏకంగా 39, 43 శాతం ఫిట్మెంట్ ని అత్యధికంగా ఇచ్చి ఖజానాకు నాటి పాలకులు భారం చేశారని ప్రభుత్వ వర్గాల వాదనగా ఉంది.
అందువల్ల ఈసారి 14.29 ఫిట్మెంట్ మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేశారు. అంతే కాదు కరోనా వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారిందని, ఏకంగా 30 వేల కోట్ల మేర నష్టం వచ్చిందని కూడా చెబుతున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా సిఫార్సుల్లో ఉంది. అయిదేళ్లకు ఒకసారి పీయార్సీని ప్రకటించలేమని, పదేళ్ళకు మాత్రమే అది కూడా కేంద్ర పే స్కేల్స్ కి అనుగుణంగా చేస్తామని అంటున్నారు.
మొత్తానికి చూస్తే ఉద్యోగుల జీతాలు అధికంగా చెల్లించాల్సి వస్తోందని, దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణా వంటి రాష్ట్రాల కంటే కూడా ఏపీకి ఆదాయం తక్కువ ఉన్నా జీతాలు మాత్రం ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయన్న వాదనను వినిపిస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తే కచ్చితంగా ప్రభుత్వం తాను అనుకునట్లుగానే 14.29 ఫిట్మెంట్ కే నిలబడుతుంది అనుకోవచ్చు. ఒకవేళ చర్చలు సంప్రదింపులు ఉంటే కనుక మరో ఒకటి రెండు శాతమే పెంపు ఉండొచ్చు.
మరి ఉద్యోగులు ఏకంగా 50 శాతానికి పైగా ఫిట్మెంట్ కోరుతున్నారు అంటే అది సాధ్యమేనా అంటే కాదు అనే చెప్పాలి. ఇక ఉద్యోగ వర్గాలు సహకరించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అలా కాదు అని ఉద్యమమే శరణ్యమని వెళ్తే ఎంతవరకూ వారికి జనాల మద్దతు ఉంటుంది అన్న చర్చ కూడా ఉంది. ఇపుడున్న పరిస్థితుల్లో అయితే ఉద్యోగులకు విపక్ష రాజకీయ పార్టీల మద్దతు ఉన్నా సగటు జనాల నుంచి మాత్రం పెద్దగా ఉండబోదు అంటున్నారు.
ఒకవేళ ఇదే ఇష్యూ మీద పోరాట బాట పడితే మాత్రం మరింత సమాచారం జనాలకు చేరి ఉద్యోగులకే అది ఇబ్బందికరం అవుతుంది అని కూడా అంటున్నారు. ఇప్పటికే నెటిజన్ల కామెంట్స్ చూస్తే ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగులకు ఇస్తున్న వేతనాల్లో నాలుగవ వంతు తమకు ఇస్తే తాము బుద్ధిగా ఉద్యోగాలు చేస్తామని చాలా మంది యువత కామెంట్స్ పెట్టడం విశేషం.
మొత్తానికి తెగే దాకా లాగడం అటు ప్రభుత్వానికీ ఇటు ఉద్యోగులకు మంచిది కాదు, ఇక ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కాబట్టి ఆర్ధిక పరిస్థితులను అర్ధం చేసుకుని సహకరించాలని కూడా కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.