సున్నితమైన.. క్లిష్టమైన అంశాల మీద మాట్లాడే వేళ.. ఎంతటి సంయమనం పాటించాలో అందరికి తెలీకపోవచ్చు కానీ తన కెరీర్ లో దాదాపు 90 వేలకు పైగా కేసుల లెక్క చూసిన రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రుకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు. సూర్య నటించిన ‘జైభీం’లో లాయర్ సూర్యం పాత్ర.. రియల్ లైఫ్ లో జస్టిస్ చంద్రుదే. న్యాయమూర్తి కావటానికి ముందు సుదీర్ఘకాలం ఆయన లాయర్ గా వ్యవహరించారు. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలైన ఈ మూవీ.. అనూహ్య విజయాన్ని సాధించటమే కాదు.. అప్పటివరకు రానంత పేరు ప్రఖ్యాతుల్ని జస్టిస్ చంద్రుకి తీసుకొచ్చింది. దీంతో.. రాష్ట్రాలకు అతీతంగా ఆయన ఇమేజ్ భారీగా పెరిగిపోయింది.
దీంతో.. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ఒక విలువ పెరిగింది. ఇలాంటివేళలో.. ఆయన ది హిందూలో రాసిన ఒక వ్యాసం ఏపీలో రాజకీయ రచ్చకు మారింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే.. జస్టిస్ చంద్రు రాసిన ఆర్టికల్ ది హిందూలో పబ్లిష్ కావటం. ఒక విశ్వసనీయమైన మీడియా సంస్థగా.. ఇప్పటికి విలువల్ని పాటిస్తుందన్న పేరు ప్రఖ్యాతులున్న సంస్థలో.. బడుగు.. బలహీన వర్గాలకు అండగా.. సమాజంలో దోపిడీకి గురయ్యే వారికి దన్నుగా నిలుస్తూ.. వారి హక్కుల కోసం పోరాడే న్యాయవాదిగా పేరున్న జస్టిస్ చంద్రు లాంటి వారు రాసిన వ్యాసం హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఆ వ్యాసంలో ఏమున్నదంటే.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం.. దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. హైకోర్టు న్యాయమూర్తులకు అమరావతిలో భూములు ఉన్నాయన్న సంచలన ఆరోపణలు చేయటం.. అందుకు సాక్ష్యంగా ఏపీ సీఐడీ అధికారుల ప్రాథమిక నివేదికను ఉటంకించటంతోనే జస్టిస్ చంద్రు వ్యాఖ్యల మీద కొత్త సందేహాలు పుట్టుకొస్తాయిన. ఎందుకంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏఫీ పోలీసుల మీదా.. ఏపీ సీఐడీ మీదా వచ్చిన ఆరోపణలు.. విమర్శల్ని కూడా జస్టిస్ చంద్రు ప్రస్తావించాలి కదా?
అలాంటిదేమీ లేకుండా.. ఒక వైపు వాదననే ఎలా వినిపిస్తారు? సోషల్ మీడియాలో గౌరవనీయ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్లుగా తిట్టటాన్ని తప్పుపడుతూ.. అలాంటి వారిపై చర్యలు తీసుకునే సందర్భబంలో కోర్టులు ఎలా బెయిల్ ఇస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో జ్యుడిషియరీ పనితీరుపై తనకున్న అభిప్రాయాల్ని చెప్పేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. అసలు సోషల్ మీడియాలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని దారుణంగా టార్గెట్ చేసిన గతాన్ని జస్టిస్ చంద్రు ఎందుకు గుర్తు పెట్టుకోలేదన్న చిట్టి ప్రశ్న మదిలో మెదులుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే అంశాలు చర్చకు వస్తాయి. మొదట్లో చెప్పినట్లుగా.. సున్నితమైన అంశాలపై స్పందించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.. ఏదైనా మాట్లాడినంతనే అర్థాల్ని బయటకు తీసే పరిస్థితులు ఉన్నప్పుడు.. మరెంత కేర్ ఫుల్ గా ఉండాలో జస్టిస్ చంద్రులాంటి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకూ.. ఎప్పుడూ లేని రీతిలో జస్టిస్ చంద్రు వివాదాస్పదానికి నిలువెత్తు రూపంలా మారటం ఆయన చేతులారా చేసుకున్నదా? లేదంటే.. ఆయన చేతులారా చేసుకునేలా ఎవరైనా చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.