ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే.. ఆయనను 'మాటల మాంత్రికుడు' అని విమర్శకు లు చెబుతుంటారు. తాజాగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా అల్లూ రి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. ప్రధాని మోడీ ఈ క్రమంలో ఏపీపై ఎనలేని ప్రేమ కురిపిం చారు. ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకు పురుడు పోసిన గడ్డ. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం పంతులు వంటి మహానుభావులను కన్న భూమి ఏపీ అన్నా రు.
దేశం కోసం బలిదానం చేసిన ఇలాంటి వారి కలలను సాకారం చేయాలి. ఈ బాధ్యత అందరిపైనా ఉంద ని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అయితే.. అందరి విషయం పక్కన పెడితే.. ఏపీపై కేంద్రానికి ఉన్న బాధ్య త ఏంటి? అనేది ముఖ్యం.
ఎందుకంటే.. ఏపీకి ఇప్పటి వరకు మోడీ హయాంలో ఇచ్చింది ఏమీ కనిపించ డం లేదు. కనీసం.. రాజధాని అమరావతికి ఆయన తన చేతులతో శంకు స్థాపన చేశారు. దీని అతీగతీ కూ డా పట్టించుకోకుండా.. రాజధాని లేని రాష్ట్రంగా ఉంచేశారు.
ఇక, పోలవరం ప్రాజెక్టుతో ఇదే ఆదివాసీ గ్రామాలు.. నియోజకవర్గాలకు నీరు పుష్కలంగా అందుతుంది. కానీ, ఈ ప్రాజెక్టును కూడా ముందుకు సాగకుండా.. అడ్డుకుంటున్నది కేంద్రం కాదా? వెనుక బడిన జిల్లా ల అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం ఉంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
మరీ ముఖ్యంగా విభజ తర్వాత.. ఏర్పడిన విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని కూడా.. పరిష్కరించలేదు. కనీసం.. నీటి వివాదాలు.. ఆస్తుల విభజన ఉద్యోగుల విభజన వంటి అనేక అంశాలు ఇప్పటికీ.. వివాదంగానే ఉన్నాయి.
మరి ఇన్ని సమస్యలు ఉన్న ఈ 'పుణ్యభూమి'ని రక్షించే.. కాపాడే.. సమస్యలు పరిష్కరించే తీరిక.. ఓపిక.. లక్ష్యం వంటివి లేవా మోడీ గారు? అనేది ప్రధాన ప్రశ్న. పుణ్యభూమి.. అని అన్నంత మాత్రాన.. ఏపీ ప్రజలకు ఒరిగింది లేదు. కనీసం..ఇప్పటికైనా.. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకుని.. పరిష్కరిస్తే.. రాజధాని.. పోలవరం.. ప్రత్యేక హోదా.. వంటి అంశాలపై ఒక పరిష్కారం చూపిస్తే.. అదే ఏపీ ప్రజలకు.. ఈ భూమికి పది వేలు.. అంటున్నారు.