ఎవడో షో నడిస్తాడు. దాన్ని చూసిన కొందరు చప్పట్లు కొడతారు. ఈలలు వేస్తారు. మరికొందరు తీవ్ర ఆగ్రహానికి గురవుతారు. ఆవేశంతో ఊగిపోతారు. మాటకు మాట అనాలనుకుంటున్నారు. ట్వీట్ కు ప్రతి ట్వీట్ చేయాలనుకుంటారు. ఇలాంటి వాటితో కొత్త ఉద్రికత్తలు తెర మీదకు వస్తుంటాయి. ఇలాంటివి తెలీకుండానే ప్రజల్ని తీవ్రమైన భావోద్వేగాలకు గురి చేస్తూ ఉంటాయి. వైసీపీ నేతల మీద పవన్ కల్యాణ్ చేసిన ఘాటు విమర్శలు.. అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు.. మొదలైంది మామూలే అయినా.. తర్వాత జరుగుతున్నవన్నీ కూడా లెక్క తేడా అన్న వాదనను కొందరు వినిపిస్తున్నారు.
పవన్ వైసీపీ నేతల్ని తిట్టారు. వైసీపీ నేతలు ఆయన్ను తిట్టారు. లెక్క అంతవరకు సరిపోయింది. సన్నాసి అని పవన్ అంటే.. పెద్ద సన్నాసి అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. సన్నాసి అన్న పదం బూతు కాకపోవటం.. తిట్ల దండకంలో సభ్య సమాజం వినలేని దారుణమైన బూతు కాకపోవటంతో.. పవన్ నోటి నుంచి వచ్చిన మాటను తాటికాయంత అక్షరాలతో పబ్లిష్ చేసిన మీడియా సంస్థలు ఉన్నాయి.. ఆయన వాడిన ‘సన్నాసి’ మాటను అదే పనిగా స్క్రోలింగ్ చేసిన చానళ్లు ఉన్నాయి.
కానీ.. పవన్ అన్న సన్నాసి మాటకు హర్ట్ అయి.. అమ్మలు.. అక్కలు.. చెల్లెళ్ల మాటల్ని దాటేసి.. దొంగ లం.. అంటూ దారుణ పదాల్ని ఉపయోగించటం ఎంతవరకు సంస్కారం. దానికి ఎంత సర్దిచెప్పుకున్నా.. సర్దుకోలేని మాటలే. పోసాని అన్న వ్యక్తికి ఆవేశం ఎక్కువ అండి. ఆయనకు పట్టలేని కోపం వస్తే.. ఎలా పడితే అలా మాట్లాడతారు.. ఆ విషయం ఇండస్ట్రీకి తెలుసు అన్న మాటనే తీసుకుంటే.. అలా వ్యవహరించే శైలితో తనను ఎవరూ ఏమీ అనే ధైర్యం చేయరన్న వ్యూహంతో ఆయన తన తీరును అలా కొనసాగిస్తున్నారని అనుకోవచ్చు కదా?
ఇక.. ఒక మంచి మనిషిని అలా అంటారా? అందుకే స్పందించానంటూ లెక్చర్ ఇచ్చే పోసాని.. మంచివాళ్లను చాలామంది చాలానే అన్నారు. అలాంటప్పుడు ఆయన స్పందించలేదేం? ఎక్కడిదాకానో ఎందుకు.. పోసాని చెప్పినట్లు ఆయన మోడీకి వీరాభిమాని. మరి.. మోడీని ఉద్దేశించి 2014 ఎన్నికల వేళలో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ వేళలో.. మోడీని దేశంలోని మరే రాజకీయ పార్టీ అధినేత అనలేనంత ఘాటైన పదాలతో ఆయన్ను విమర్శించారు. మరి.. మోడీని అంతలా అభిమానించే పోసాని.. నాడు కేసీఆర్ మీద ఇలా తిట్ల దండకం ఎందుకు విప్పలేదు? ఆయనకు స్పందించే గుణం ఎక్కువ కదా? అలాంటప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదు?
పవన్ కల్యాణ్ డేట్లు ఇస్తే.. రూ.40కోట్లు అయినా ఇస్తా.. ఆయన ఇండియాలోనే టాప్ హీరో అంటూ ఆయన్ను పొగిడేస్తూ.. గతంలో ఇదే పోసాని నోటి నుంచి మాటలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు చక్కర్లు కొడుతున్నాయి. అంటే..పవన్ అంటే పోసానికి అభిమానమన్నట్లేగా? మరి.. అలాంటి పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఎటకారపు వ్యాఖ్యలు చేసినోళ్ల మీద పోసాని ఎందుకు రియాక్టు కాలేదు?
ఎవరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటారన్నది వారి వ్యక్తిగత విషయం. అందులో నైతికత ఏమైనా ఉందంటే.. చట్టవిరుద్దంగా పెళ్లి చేసుకుంటే.. పవన్ బ్యాడ్ లక్ ఏమో ఆయన చేసుకున్న రెండు పెళ్లిళ్లు సెట్ కాలేదు. అందులో ఆయన తప్పు ఎంత? అన్నది ప్రశ్న. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడే వారికి నొప్పి ఉంటుంది కానీ.. ఆయన నుంచి విడాకులు తీసుకున్న ఇద్దరు భార్యలు ఇప్పటివరకు ఆయన మీద పల్లెత్తు మాటలు అనలేదు. అంటే.. ఇక్కడ సమస్య విడాకులు తీసుకున్న మహిళల కంటే కూడా పవన్ ను వ్యతిరేకించే వారికి నొప్పి ఎక్కువగా ఎందుకు ఉన్నట్లు?
పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడే పెద్ద మనుషులు.. ఒకవేళ పవన్ చేసింది తప్పే అయితే.. చట్టం చూస్తూ ఊరుకోరు కదా? ఆయన్ను తప్పు పట్టే వారు ఇప్పుడు అధికారంలో ఉన్న వారు ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు కదా? ఆయన వ్యక్తిగత విషయాన్ని తరచూ తట్టి లేపటం ద్వారా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు.. మంచి మనసు.. స్పందించే గుణం ఉన్న పోసాని ఎందుకు స్పందించలేదు?
ఎక్కడా ఫిర్యాదు చేయనప్పటికి పంజాబీ నటి మీద ఆయన ప్రదర్శించిన జాలి.. పవన్ ను అదే పనిగా ఆడిపోసుకుంటున్న వారికి బుద్ది చెప్పేలా స్పందించాలని పెద్ద చదువులు చదివిన పోసానికి ఎందుకు అనిపించలేదంటారు సామి? ఇదంతా రాసినందుకు పవన్ తరఫున వకల్తా పుచ్చుకున్నట్లు కదా? తెలివిగా వాదనల్ని వినిపిస్తూ అడ్డదిడ్డంగా మాటల్ని అనేసే తీరును తప్పు పట్టకుంటే.. నోరున్న వాడిదే రాజ్యంగా మారి.. మిగిలిన వారంతా నోరు మూసుకోవాల్సి ఉంటుందన్న పలువురి ఆవేదనను తెలియజేసేందుకు ఇదంతా తప్పలేదు.