డిమాండ్: పబ్ జీని నిషేధించాలి

Update: 2020-07-01 00:30 GMT
మన సైనికులను చంపి కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు బుద్ది చెప్పడానికి.. ఆ దేశ చైనా యాప్స్ ను భారత్ నిషేధించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్స్ ను కేంద్రం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 కోట్ల మంది వాడుతున్న టిక్ టాక్ ను కూడా భారత్ నిషేధించడంతో ఇప్పుడు కేంద్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. చైనాకు ఇది చెంప పెట్టులాంటిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి టిక్ టాక్ సహా ఈ 59 యాప్స్ ను తీసేశారు. ఇక ఈ కోవలోనే చాలా మంది ప్రాణాలు తీస్తున్న క్రూయల్ గేమ్ పబ్ జీని కూడా నిషేధించాలని నెటిజన్ల నుంచి తాజా డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఆటకు బానిసైన వారు దారుణాలకు ఒడిగట్టారని వారు గుర్తు చేశారు.

పబ్ జీని మొబైల్ ఫ్లాట్ ఫాంకు తెచ్చేందుకు చైనాకు చెందిన ఓ కంపెనీయే చేపట్టిందని.. ఈ గేమ్ ను కూడా నిషేధించాలని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, అమిత్ షా సహా పలువురు అకౌంట్లకు ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున నెటిజన్లు సోషల్ మీడియా పబ్ జీని బ్యాన్ చేయాలని ట్రోలింగ్ చేస్తున్నారు. ట్విట్టర్ లో ‘పబ్ జీ బ్యాన్’ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే ట్రెండ్ అవుతోంది.

చైనీస్ యాప్స్ బ్యాన్ నేపథ్యంలో వాటిలాగే దేశంలో తయారైన యాప్ లకు ఇప్పుడు డిమాండ్ పెరిగిపోతోంది. టిక్ టాక్ ప్లేసులో చాలా మంది చింగారీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వీడియోలు పెడుతున్నారు.
Tags:    

Similar News