వివాదంలో బీజేపీ ఎంపీ..ఐదేళ్ల కిందటి ట్వీట్ తొలగింపు

Update: 2020-04-20 16:57 GMT
బీజేపీ యువ ఎంపీ గతంలో ఎప్పుడో 2015లో చేసిన ట్వీట్ కు ఇప్పుడు బుక్కయ్యాడు. అది వివాదాస్పదం అయ్యింది. ఈ ట్వీట్ తీవ్ర దుమారం రేగడంతో దాన్ని తేజస్వి తొలగించేశాడు.

దాదాపు ఐదేళ్ల కిందట ప్రస్తుతం కర్ణాటక నుంచి బీజేపీ యువ ఎంపీగా ఉన్న తేజస్వి సూర్య ‘అరబ్ దేశాలకు చెందిన 95శాతం మంది మహిళలకు ఆర్గజమ్స్ ఉండవని’ సంచలన కామెంట్ చేశారు. శృంగార సమయంలో అరబ్ మహిళలు ఉద్వేగానికి లోను కారని.. యాంత్రికంగా శృంగారంలో పాల్గొంటారని.. 500 సంవత్సరాలుగా అరబ్ దేశాల్లో ఇదే తీరు కొనసాగుతోందని అన్నారు. వారంతా ప్రేమతో పిల్లలను కనట్లేదని అన్నారు. బిడ్డలను ఉత్పత్తి చేసే యంత్రాలుగా మహిళలు ఉన్నారని.. ప్రేమతో కాదని సంచలన కామెంట్స్ చేశారు.

ఐదేళ్ల కిందట చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. తేజస్వి ట్వీట్ పై అరబ్ దేశాలకు చెందినవారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక ప్రజానాయకుడు స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. తేజస్వి బీజేపీకే కాకుండా మొత్తం దేశ ప్రజలను ఈ ట్వీట్ తో అనుమానించాడని నెటిజన్లు మండిపడుతున్నారు. తక్షణం చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

ఐదేళ్ల కిందట చేసిన ఈ ట్వీట్ పై కర్ణాటక కాంగ్రెస్ కూడా స్పందించింది. తేజస్వి మరో ఎంజే అక్బర్ లాగా మారి నోటి దురుసుతో ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. దీనివెనుక మోడీ, అమిత్ షా ప్రోత్సాహం ఉందని విమర్శించారు. బీజేపీలో ఇలాంటి నాయకులున్నారని.. మీటూ లోనూ బీజేపీ నేతలున్నారని.. బీజేపీ ఇలాంటి నేతలను తయారు చేసి సమాజంపైకి వదులుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. దీనిపై బీజేపీ మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు.

తన ఐదేళ్ల కిందటి ట్వీట్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తేజస్వి సూర్య వెంటనే ఆ ట్వీట్ ను తొలగించారు. అయితే తేజస్వీ ఈ ట్వీట్ తొలగించినా ఆ వివాదం ఆగలేదు. అతడిపై నెటిజన్లు పిరికిపంద అంటూ కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News