ఇదేంది అచ్చెన్న.. స్వామివారి ప్రసాదాల్ని ఇలా చేయటమేంటి?

Update: 2021-03-30 07:30 GMT
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. పలువురి మనోభావాల్ని దెబ్బ తీసేలా ఆయన వ్యవహారశైలి ఉందన్న మాటతోపాటు.. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. సోమవారం తిరుపతిలోని కపలిలతీర్థం వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీవారి పరమ పవిత్రమైన ప్రసాదాలైన లడ్డూలు.. వడలను తీసుకొచ్చారు. వాటిని నేల మీద పెట్టిన.. ఆ పక్కనే అచ్చెన్నాయుడు.. ఇతరటీడీపీ నేతలు బూట్లకాళ్లతో తిరగటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తరచూ శ్రీవారి ఆలయం గురించి.. అందులో తప్పులు చేస్తున్నారని విమర్శలు చేసే అచ్చెన్న అండ్ కోలు..తమ వరకు ఎలా వ్యవహరిస్తున్నారనటానికి నిదర్శనంగా తాజా ఫోటో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నీతులు చెప్పేందుకేనా? పాటించేందుకు కాదా? అన్న ప్రశ్నకు అచ్చెన్న ఏమని బదులిస్తారో?
Tags:    

Similar News