రాష్ట్రంలో ప్రతిపక్షాల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంలో ప్రతిపక్షాలు చాలా అత్యుత్సాహం చూపుతున్నాయి. రఘురామను సీఐడీ అదుపులోకి తీసుకున్న దగ్గరనుండి జైల్లో పెట్టడం వరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదలు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు.
ఇక్కడ అసలు సమస్యకన్నా కొసరు ఎక్కువైపోయాయి. సీఐడీ అరెస్టు చేసింది అనేకన్నా విచారణలో భాగంగా కొట్టిందనే విషయమే పెద్ద సమస్య అయిపోయింది. తనను పోలీసులు కొట్టారంటు ఆరోపించిన రాజు అందుకు కాలిపై ఉన్న గాయాలను చూపించారు. ఈ విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వమని హైకోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటుచేసింది. రాజు కాలిని పరిశీలించిన మెడికల్ బోర్డు అవసలు గాయాలే కావని తేల్చింది.
ఆయనకు ఎడీమా అనే సమస్యుందని బోర్డు తమ నివేదికలో చెప్పింది. ఆయన కాళ్ళల్లో నీరుచేరటం వల్ల వాపు వచ్చిందన్నారు. దీనివల్లే అరికాళ్ళలో రంగుమారిందన్నారు. మెడికల్ బోర్డు వైద్య పరీక్షల తర్వాత రమేష్ ఆసుపత్రో లేకపోతే మరో ప్రైవేటు ఆసుపత్రి వైద్యులో పరీక్షలు చేయాల్సుంది. ఈ పరీక్షల్లో ఏమి తేలుస్తారో చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన రెండేళ్ళుగా ఇదే తిరుగుబాటు ఎంపి ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిట్టారు.
అప్పట్లో ప్రతిపక్షాల్లో ఉన్న నేతలెవరూ ఎంపిని వారించలేదు. ప్రభుత్వంలో లోపాలను ఎత్తిచూపటంలో తప్పులేదు కానీ వ్యక్తిగతంగా దూషించకూడదని తిరుగుబాటు ఎంపికి బుద్ధి చెప్పినట్లు కనబడలేదు. జగన్ను తిరుగుబాటు ఎంపి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చోద్యం చూస్తు కూర్చున్న ఈ నేతలు అరెస్టు విషయంలో మాత్రం రెచ్చిపోతున్నారు. ఎంపికి మద్దతుగా చంద్రబాబు అయితే ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాసేశారు. ఇప్పటికే ఎంపిని పరీక్షించిన వైద్యబృందం గాయాలు కావని తేల్చినా చంద్రబాబు అండ్ కో ఏమాత్రం పట్టించుకోవటంలేదు.
ఎంపిని కొట్టారని, జైల్లో రఘురామ ప్రాణాలకు హాని ఉందని, తన భర్త హత్యకు జైల్లో కుట్రలు చేస్తున్నారని తిరుగుబాటు ఎంపి భార్య, చంద్రబాబు, అచ్చెన్న, టీడీపీ ఎంపిలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, సోమువీర్రాజు లాంటి వాళ్ళు పదే పదే గోలచేస్తున్నారు. అరెస్టయిన ఎంపి రాజకీయాలకు కొత్తేమీకాదు. అన్నీ రకాలుగాను బలసంపన్నుడనే చెప్పాలి. ప్రభుత్వంతో సమస్యలు వస్తే గట్టిగా ఎదుర్కొనేంత శక్త ఉన్న నేతనే చెప్పాలి. అలాంటి ఎంపికి మద్దతుగా ప్రతిపక్షాల నేతలంతా ఎందుకింతగా ఉత్సాహం చూపుతున్నారో అర్ధం కావటంలేదు.