సమర్ధించుకోవటానికి అవస్తలు పడుతున్న బీజేపీ

Update: 2021-03-10 09:30 GMT
విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించే విషయంలో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటనను సమర్ధించేందుకు బీజేపీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత సత్యమూర్తి మాట్లాడుతు స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా వివాదం చేస్తున్నట్లు మండిపడ్డారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల దగ్గర అంశాలేవీ లేకపోవటంతోనే స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ అంశాన్ని పట్టుకున్నట్లు మండిపడ్డారు.

ప్రభుత్వ రంగ సంస్ధల్లో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహించాలన్న విధానపరమైన నిర్ణయం వల్లే విశాఖ స్టీల్స్ లోని పెట్టుబడులను కూడా ఉపసంహరించబోతున్నట్లు కేంద్రమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే విశాఖ ఫ్యాక్టరీని ఎవరైనా కొనదలచుకుంటే కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ ఆధారంగా బిడ్డింగ్ లో పాల్గొనవచ్చని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బిడ్డింగ్ లో పాల్గొని విశాఖ స్టీలును సొంతం చేసుకోవచ్చు కదా అని సత్యమూర్తి ప్రశ్నించారు.

విశాఖ స్టీల్స్ అమ్మకంలో కేంద్రం పారదర్శకంగానే వ్యవహరిస్తుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఫ్యాక్టరీకి చెందిన 22 ఎకరాల భూమిని ఇప్పటికే కారుచౌకగా ఇతరులకు అమ్మేశారని జరగుతన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఫ్యాక్టరీ భూమిని ఎవరికీ అమ్మలేదని, భవిష్యత్తులో కూడా కారుచౌకగా ఎవరికంటే వారికి అమ్మేసే అవకాశం కూడా లేదన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రమంత్రిని సమర్ధిస్తు మాట్లాడిన సీనియర్ నేత సత్యమూర్తి ఎవరో పార్టీలోనే చాలామందికి పరిచయంలేదు. అసలా సత్యమూర్తి ఎవరు ? ఏ జిల్లా నేత అన్న విషయం కూడా చాలామందికి తెలీదు. ఎక్కడో ఢిల్లీలో  కూర్చుని రాష్ట్రంలో జరిగే పరిణామాలపై వ్యాసాలు మాత్రం రాస్తుంటారు. ఈయనకు ప్రత్యక్ష రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదు. ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడేందుక రాష్ట్రంలోని నేతలు భయపడుతుంటే ఢిల్లీలో కూర్చుని సత్యమూర్తి నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.
Tags:    

Similar News