రాజకీయం రంగప్రవేశం చేయాలే కానీ.. విషయం ఏదైనా వివాదాస్పదం చేయొచ్చు. ఇష్యూను టేకప్ చేసే వారి సామర్థ్యం.. వాదనా పటిమతో మామూలు విషయం కాస్తా వివాదాస్పద అంశంగా మారి హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికార వైసీపీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
వైసీపీకి ఓటు వేయటం వెంకన్నకు ద్రోహమే అంటూ పవన్ చేసిన వ్యాఖ్య చురుకు పుట్టేలా చేయటమే కాదు.. అధికార పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరి సతీష్ శర్మ తీవ్రంగా మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాల్ని దెబ్బ తీశాయని ఆరోపించారు.
అందుకే తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని బ్రాహ్మణులంతా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి.. బీజేపీ..జనసేన పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ హిందుత్వ ముసుగులో బ్రాహ్మణుల్ని మోసం చేస్తోందని.. సీఎం జగన్ సర్కారులో బ్రాహ్మణులకు గౌరవం.. రాజకీయంగా గౌరవం.. గుర్తింపు లభించాయన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. పవన్ తిరుపతి వెంకన్న ప్రస్తావన తెస్తే.. ఆయన మాటల్లో తప్పు ఎత్తి చూపి.. బ్రాహ్మణులకు లింకు వేయటం ఏమిటి? నిజంగానే పవన్ మాటలు..వెంకన్న భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసేంత ఉందా?