మోడీ మేనియా 2014 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతోంది. మోడీ చేసిందే శాసనం.. ‘బాహుబలి’ రమ్యక్రిష్ణలా దేశంలో ఇప్పుడు మోడీ అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ మరొకరు లేరు. ఆయన గీసిందే గీత.. ఆదేశించిందే శాసనం. అందుకే కరోనా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చినా మోడీ సార్ తన గొప్పలకు విదేశాలకు పంచుతూ దేశ ప్రజలను ఎండగడుతున్నా ఒక్క మీడియా కూడా.. మేధావులు పార్టీలు కూడా గొంతెత్తని పరిస్థితి దేశంలో ఉంది... దేశ ప్రజలకు ముందుగా ఇవ్వాల్సిన టీకాలను తన గొప్పల కోసం పక్కదేశాలకు పంచుతూ మోడీ క్రెడిట్ కొట్టివేస్తుంటే.. కరోనాతో దేశంలో ప్రజలు చస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ ఇటీవల కాస్త గట్టిగానే కడిగేశాడు.
కరోనా లాక్ డౌన్ వేళ మోడీ పెట్టమంటే దీపాలు పెట్టాం.. చప్పట్లు కొట్టామని.. కానీ కరోనా వ్యాక్సిన్ దేశంలో రిలీజ్ అయినా కూడా పక్కదేశాలకు పంపిస్తుంటే ఇప్పుడు అదే ప్రజలు చేష్టలుడిగి చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదేమీ మోడీ రాజ్యంరా బాబూ అని తలపట్టుకుంటున్నారు. అయితే ఓటేసి అధికారం అప్పగించిన పాపానికి అనుభవించకతప్పుదు అని నిట్టూరుస్తున్నారు. వ్యాక్సిన్లు ఏవీ మోడీ జీ అని గట్టిగా అడగలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారు. అడిగితే దేశ ద్రోహులన్న ముద్ర
అవినీతితో పంకిలమైన కాంగ్రెస్ సర్కార్ పై వెగటు పుట్టిన దేశ ప్రజలంతా 2014 ఎన్నికలకు ముందు మోడీ ప్రధాని కావాలని కోరుకున్నారు. ఒక సామాన్యుడు.. చాయ్ వాలా.. పైగా గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తీరు చూసి మంచి పాలకుడు అని మోడీకి పట్టం కట్టారు.
గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి కుంభకోణాలు.. పాలనవైఫల్యాలు విసుగు చెంది బీజేపీని గెలిపించారు. అయితే మోడీ నాడు మీడియాలో స్పీచులు దట్టించి ప్రజలను ఉద్దరిస్తానంటూ భరోసా కల్పించి ప్రజలందరినీ తన బుట్టలో పడేశాడని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
మోడి మేజిక్ నుంచి తేరుకునే లోపలనే 5 ఏళ్లు అయిపోయాయని.. మళ్లీ కొత్త పల్లవి అందుకొని 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. అయితే ఇప్పుడు మోడీ రంగు, రుచి చిక్కదనం అందరికీ తెలిసిపోయింది. సీఎంలకు మోడీ పాలనరీతి తెలుస్తోందని.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఉన్నాడని.. ప్రతిపక్ష సీఎంలకు అయితే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు అని అంటున్నారు.