ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని నరేంద్ర మోడీ ఏడేళ్లు అయ్యింది. గడిచిన ఏడాదిగా కరోనాతో కిందామీదా పడుతున్నారు కానీ.. అంతకు ముందు ఆరేళ్లుగా ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా చేసే వెసులుబాటు దొరికింది. ఇంతకాలం నెత్తిన పెట్టుకున్న మోడీని ఇప్పుడు అందరు ఆడిపోసుకునే వారే. ఒకప్పుడు భూతద్దం వేసినా కూడా కనిపించని తప్పులు.. ఈ మధ్యన ఉత్తి పుణ్యమానికే పదుల సంఖ్యలో దొరుకుతున్నాయి.
అవినీతి చేతికి చిక్కని మోడీ.. కాలానికి చిక్కారన్న మాట మోడీ వీరభక్తుల నోటి నుంచి వినిపిస్తుంటుంది. ఏడళ్లు ప్రధానిగా వ్యవహరించిన ఆయన తానెంత బాగా పని చేశానన్న విషయాన్ని ఆయనకు ఆయనే చెప్పుకోవాల్సిన పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. ఒకప్పుడు మోడీ విజయాల్ని ఆయన్ను అభిమానించేవారు సోషల్ మీడియాలో పోస్టుల దండోరా వేసి దేశమంతా చాటింపు వేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మోడీనే స్వయంగా రంగంలోకి దిగాల్సిన దుస్థితి. తాజాగా నిర్వహించిన ఆయన మానసపుత్రిక మన్ కీ బాత్ వేదిక మీదుగా ఆయన తాను సాధించిన విజయాల గురించి ఏకరువు పెట్టుకున్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన ఏడున్నర దశాబ్ద కాలంలో 3.5 కోట్ల గ్రామీణ ఇళ్లకు కొళాయి నీటి సరఫరా ఇవ్వగా.. గడిచిన 21 నెలల్లో 4.5కోట్ల ఇళ్లకు తాగు నీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. కరోనా ఇబ్బందుల వేళ ఆయుష్మాన్ భారత్ పథకం అండగా నిలిచినట్లు చెప్పారు. ఏడేళ్లలో డిజిటల్ లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయని.. కరోనా వేళ ఇదంతా ఎంతో సాయం చేసిందన్నారు.
కొవిడ్ వేళలోనే తుపాన్లూ వచ్చాయని.. అధికార యంత్రాంగం సమర్థంగా వ్యవహరించి ప్రాణ నష్టం కనిష్ఠంగా ఉండేలా చూశారన్నారు. వందేళ్లలో ఒకసారి వచ్చే మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. కరోనా ప్రతి వ్యవస్థ మీదా ప్రభావం చూపిస్తే.. వ్యవసాయ రంగం మాత్రం దీని నుంచి తప్పించుకుందని చెప్పారు. రైతులు రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి చేశారన్నారు. రైతుల కారణంగానే 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ను ఇవ్వగలుగుతున్నట్లు చెప్పారు.
ఏడేళ్లలో సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ అనే మంత్రంపై పాలన సాగినట్లు చెప్పిన మోడీ.. ఇప్పుడు దేశం ఇతర దేశాల ఆలోచన.. ఒత్తిడి ప్రకారం కాకుండా సొంత సంకల్పంతో నడుస్తోందన్నారు. సైన్యం స్థైర్యం రెట్టింపైందన్నారు. తన విజయాల్ని ఘనంగా చాటుకున్న మోడీ.. పెద్ద నోట్ల రద్దు వల్ల సాధించిన విజయాన్ని చెప్పలేదు. అంతేనా.. లీటరు పెట్రోల్ వంద రూపాయిల్ని దాటేస్తే.. డీజల్ మరో మూడు నెలల వ్యవధిలో అదే బాటలోకి వచ్చేస్తుందన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. దీనికి తోడు బంఫర్ ఆఫర్ అన్నట్లు.. వంట నూనెల ధరలు చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఏడాది వ్యవధిలో దగ్గర దగ్గర రెట్టింపు కావటాన్ని ఆయన మాట వరసకు ప్రస్తావించలేదు.
ఆహార ధాన్యాల ధరలతో పాటు.. ఇతర వస్తు సేవల ధరలు భారీగా పెరగటాన్ని ఆయన ప్రస్తావించలేదు. మోడీ మాట్లాడని వాటి గురించి అదే పనిగా ఆలోచించి.. బుర్ర చెడగొట్టుకునే కన్నా.. మోడీ చెప్పిన విజయాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి పండుగ చేసుకుంటే సరిపోతుంది. వైఫల్యాల్ని చెప్పుకోవటానికి మోడీ రుషి కాదు కదా.. మామూలు మనిషే కదా?