లోకేష్ జోరు మీద ఉన్నాడు.. కంటెంట్ రైటర్ మారాడా?

Update: 2021-04-07 05:36 GMT
లోకేష్ భాషపటిమ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో కొడితే చాలు. ఆయన తెలుగు పదాలు ఎన్ని తప్పులు దొర్లాయో.. ఎన్నిసార్లు అభాసుపాలయ్యాడో ఇట్టే తెలిసిపోతుంది.  లోకేష్ మాట్లాడాడంటే వంద తప్పులు పట్టవచ్చు అని అతడి స్పీచ్ చూస్తేనే తెలుస్తుంది.  అయితే తాజాగా లోకేష్ బాబు భాష పటిమ చాలా మారింది. తిరుపతి ప్రచారంలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏమైంది? ఈ మార్పునకు కారణమేంటి? తెరవెనుక ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది.

ఎన్నికల తర్వాత ఆ మధ్య విలేకరుల సమావేశంలోనూ తన తప్పులపై లోకేష్ బాబు స్పందించాడు. ‘నేను ఇంగ్లీష్ మీడియంలో చదివానని.. తెలుగులో కొన్ని తప్పులు మాట్లాడితే తప్పేంటని’ అని జర్నలిస్టులనే ప్రశ్నించాడు. కానీ ఈ మధ్య తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ మీద.. వైసీపీ మీద లోకేష్ పంచ్ డైలాగులు వేస్తూ హోరెత్తిస్తున్నాడు. పిట్ట.. పిల్లి కథలు కూడా చెప్పి కేసీఆర్ లా అలరించేస్తున్నాడు. అయితే మరీ నాటుగా..  చాలా పరుష పదజాలంగా ఉన్నాయని టీడీపీ మేధావులు అంటున్నారు.

కానీ అసలు విషయంకు వస్తే ఈ మధ్య ట్విట్టర్ స్పీచ్ కంటెంట్ రైటర్ మారాడని.. ఆ స్పీచ్ రైటర్ యంగ్ అని.. పంచులు బాగానే ఉన్నా రాబోయే రోజుల్లో అవి అతడి మెడకు చుట్టుకుంటాయని అంటున్నారు.  ఆ కంటెంట్ రైటర్ కు ఏమాత్రం అవగాహన లేకుండా లోకేష్ కు అటాకింగ్ మోడ్ లో రాసి ఇస్తున్నాడని అంటున్నారు.

అలానే వైసీపీ నుంచి కొందరు మంత్రులు కూడా అలానే వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని.. అందుకే అదే దూకుడు లోకేష్ కొనసాగిస్తున్నాడని టీడీపీ వర్గాలు సమర్థించుకుంటున్నాయట.. అయితే ప్రజలు కొంచెం గమనిస్తారని.. రెండు పార్టీల వాళ్లు ఇది తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు. యూట్యూబ్ వ్యూస్ కోసం థంబ్ నేల్స్ పెట్టుకోవడానికి ఈ డైలాగులు బాగానే ఉన్నా.. సాధారణ ప్రజలకు ఇలాంటివి సహించరు అని చదువుకున్న వాళ్లు అంటున్నారు. 
Tags:    

Similar News