ష‌ర్మిల ఇష్యూ.. గుర్తుకొస్తున్నాయి.. నెటిజ‌న్ల టాక్‌!

Update: 2022-11-30 05:45 GMT
తెలంగాణ‌లో టీక‌ప్పులో తుఫాను మాదిరిగా క‌నిపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల అరెస్టు.. దీనికి ముందు జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాలు వంటివాటిని ప‌రిశీలించిన నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ''గుర్తుకొస్తున్నాయి'' అని వారు కామెంట్లు పెట్ట‌డం గ‌మ‌నార్హం. దీంతో ష‌ర్మిల‌కు సింప‌తీ క‌న్నా.. ఈ కామెంట్లే ఎక్కువగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో తెలంగాణ ముఖ్యమంత్రితో సహా మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను షర్మిల నోటికొచ్చినట్లు తిట్టిన విష‌యాన్ని కొంద‌రు ఇప్పుడు ప్ర‌స్తావిస్తున్నారు.  హైదరాబాద్లో షర్మిల అరెస్టు ప‌రిణామం కొంత సేపు ఏం జ‌రుగుతోందో తెలియ‌లేదు.. అన్న‌ట్టుగా సాగింది. అయితే, అనంత‌రం.. ఆమె విష‌యంలో నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందించారు.

సీఎం కేసీఆర్‌ను 420 అని, మగాళ్లు కాదా? మగతనం లేదా? అని మాట్లాడి సింప‌తీ గెయిన్‌చేయాల‌ని అనుకున్న ష‌ర్మిల‌.. ఇప్పుడు ఎందుకు మ‌రోసారి ఇలా ఎందుకు బేలగా మారారు? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం.

మహిళా నేత ఎమ్మెల్సీ కవితపై కూడా షర్మిల ప‌రుష వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డిన సంద‌ర్భాల‌ను నెటిజ‌న్లు గుర్తుకొస్తున్నాయి.. అని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, త‌నే సొంత‌గా కారు న‌డుపుతూ.. ప్రగతిభవన్ వద్ద కు  చేరుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం.. కేవ‌లం షర్కిల ప‌బ్లిసిటీ కోసం ప్రయత్నించారనే టాక్ వినిపిస్తోంది.   తెలంగాణ పోలీసులు బతిమాలినా పర్మిల అక్కడి నుంచి వెళ్లలేదు.. దాదాపు గంట సేపు ఆమె కారులోనే కూర్చున్నారు.

అందుకే వాహనంతో సహా అరెస్టు చేయాల్సి వచ్చిందన్న పోలీసుల వాద‌న‌లో త‌ప్పులు క‌నిపించ‌డం లేద‌నే టాక్ కూడా వినిపిస్తున్నాయ‌ని అంటున్నారు. మొత్తానికి ష‌ర్మిల ఘ‌ట‌న‌.. గ‌తాన్ని గుర్తు చేసింద‌నే టాక్ వినిపించేలా చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News