తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు స్పందించి సాయం చేసే వారు తక్కువ మందే ఉంటారు. అందులోనూ మట్టిలో మాణిక్యాల్లాంటి కొందరు ఉంటారు. వారి గురించి తెలిసినప్పుడు.. వారి ఉదారతకు కదిలిపోవాల్సిందే. వారి పెద్ద మనసుకు ఫిదా కావాల్సిందే. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగు చూసింది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 70 ఏళ్ల పెద్ద వయస్కురాలు బుచ్చవ్వ. లాక్ డౌన్ వేళ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం తెలిస్తే అవాక్కు కావటమే కాదు.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు మించిన పెద్ద మనసు ఆమె సొంతంగా చెప్పాలి.
కోరుట్లకు చెందిన బుచ్చవ్వ బట్టలు ఉతికే పని చేస్తుంది. ఆమె భర్త గంగారాం ఇస్త్రీ చేసేవారు. అలా పని చేసుకుంటూ ముగ్గురు కొడుకుల్ని పెంచి పెద్ద చేశారు. వయసు మీద పడటంతో గంగారాం విశ్రాంతి తీసుకుంటుంటే.. బుచ్చవ్వ మాత్రం ఇప్పటికి పలువురి ఇళ్లల్లో బట్టలు ఉతుకుతోంది. అలా పని చేస్తున్న ఆమె గడిచిన నాలుగేళ్లలో రూ.25వేల మొత్తాన్ని దాచుకుంది. లాక్ డౌన్ వేళ పేదలు పలువురు డబ్బుల్లేక పస్తులు ఉండటాన్ని గమనించిన ఆమె.. తాను దాచుకున్న రూ.25వేలతో తన చుట్టు ఉన్న వారికి రూ.1500 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది.
రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన మొత్తాన్ని తన అవసరాల కోసం దాచుకోకుండా.. కష్టంలో ఉన్న తోటి వారి కోసం ఖర్చు చేసిన తీరు మంత్రి హరీశ్ వరకూ వెళ్లింది. దీంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. బుచ్చవ్వ సాయాన్ని వెలకట్టలేమని.. లాక్ డౌన్ కారణంగా కుదేలవుతున్న బిడ్డలకు నువ్వే కన్నతల్లివైనావు.. వాళ్ల గోసలో భాగం పంచుకుందామన్న నీ ఆరాటం ఎందరికో స్ఫూర్తిదాయకమంటూ పొగిడేశారు. బుచ్చవ్వ ఎపిసోడ్ తెలిశాక.. సెలబ్రిటీలు ఇచ్చే లక్షల రూపాయిలు చిన్నబోయేలా కనిపించటం ఖాయం.