‘రామ్ గోపాల్ వర్మ..’ ఎవ్వరు ఏమనుకున్నా.. తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. అది కొందరికి నచ్చుతుంది. మరొకందరికి నచ్చదు. విచిత్రం ఏమంటే.. ఒక విషయంలో ఆయన్ను విభేదించిన వారు మరో విషయంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. మరోసారి ఇది రివర్స్ అవుతూ ఉంటుంది. కానీ.. ఇప్పుడు ఒక విషయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆర్జీవీకి మద్దతు పెరుగుతోంది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై డైరెక్ట్ అటాక్ చేస్తూ వస్తున్నారు వర్మ. సెకండ్ వేవ్ విజృంభణకు కుంభమేళా ప్రధాన కారణమన్న ఆర్జీవీ.. గతేడాది తగ్లీబీ జమాత్ విషయంలో ముస్లింలను నిందించిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దాదాపు 6 లక్షల మంది కుంభమేళాలో పాల్గొని స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. అప్పటికే తీవ్రంగా ఉన్న కరోనా.. ఆ తర్వాత మరింత విజృంభించింది. కుంభమేళాలలో పాల్గొన్న పలువురు కొవిడ్ బారిన పడ్డారు కూడా. ఈ విషయమై పలు ట్వీట్లు చేసిన ఆర్జీవీ.. తాజాగా కుంభమేళాకు లింక్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. అందులో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో.. ఓ పెళ్లి వేడుకలోకి ప్రవేశించిన పోలీసులు.. ఆ వేడుకను అడ్డుకున్నారు. అంతేకాదు.. పెళ్లికొడుకుతో సహా కొందరిపై చేయి చేసుకున్నారు కూడా. దీనిపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వివాహ వేడుకలోకి దూరి ప్రజలను పోలీసులు కొడుతున్నారన్న ఆర్జీవీ.. రాజకీయ పార్టీల సమావేశాలకు, కుంభమేళాకు అనుమతి ఇచ్చినందుకు ప్రజలు కూడా తిరబడి కొడితే పర్వాలేదా? అని ప్రశ్నించారు.
ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ కు అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోంది. ప్రజలు కొవిడ్ తో చనిపోతుంటే.. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. కుంభమేళా వంటి కార్యక్రమాల్లో లక్షలాదిగా భక్తులు పాల్గొన్నారు. వీరిని ఏమీ అనలేని పోలీసులు.. నాలుగు గోడల మధ్య పెళ్లి చేసుకునే వారిపై దాడి చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.Full View Full View Full View
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై డైరెక్ట్ అటాక్ చేస్తూ వస్తున్నారు వర్మ. సెకండ్ వేవ్ విజృంభణకు కుంభమేళా ప్రధాన కారణమన్న ఆర్జీవీ.. గతేడాది తగ్లీబీ జమాత్ విషయంలో ముస్లింలను నిందించిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దాదాపు 6 లక్షల మంది కుంభమేళాలో పాల్గొని స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. అప్పటికే తీవ్రంగా ఉన్న కరోనా.. ఆ తర్వాత మరింత విజృంభించింది. కుంభమేళాలలో పాల్గొన్న పలువురు కొవిడ్ బారిన పడ్డారు కూడా. ఈ విషయమై పలు ట్వీట్లు చేసిన ఆర్జీవీ.. తాజాగా కుంభమేళాకు లింక్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. అందులో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో.. ఓ పెళ్లి వేడుకలోకి ప్రవేశించిన పోలీసులు.. ఆ వేడుకను అడ్డుకున్నారు. అంతేకాదు.. పెళ్లికొడుకుతో సహా కొందరిపై చేయి చేసుకున్నారు కూడా. దీనిపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వివాహ వేడుకలోకి దూరి ప్రజలను పోలీసులు కొడుతున్నారన్న ఆర్జీవీ.. రాజకీయ పార్టీల సమావేశాలకు, కుంభమేళాకు అనుమతి ఇచ్చినందుకు ప్రజలు కూడా తిరబడి కొడితే పర్వాలేదా? అని ప్రశ్నించారు.
ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ కు అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోంది. ప్రజలు కొవిడ్ తో చనిపోతుంటే.. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. కుంభమేళా వంటి కార్యక్రమాల్లో లక్షలాదిగా భక్తులు పాల్గొన్నారు. వీరిని ఏమీ అనలేని పోలీసులు.. నాలుగు గోడల మధ్య పెళ్లి చేసుకునే వారిపై దాడి చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.