తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తనలోని మానవీయ కోణాన్ని ప్రదర్శించారు. తనకున్న ఆర్థిక సమస్య గురించి పేర్కొంటూ.. తన అవసరం గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ మొయిల్ చేసిన యువకుడికి ఊహించని రీతిలో రాజ్ భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన సమస్యను తీర్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రంగారెడ్డి జిల్లా చేతూరు గ్రామానికి చెందిన ప్రమోద్ డిఫార్మా మూడో సంవత్సరం చదువుతున్నాడు. సామాన్య కుటుంబానికి చెందిన అతడు.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ‘మై గవర్నమెంట్ యాప్’ లో క్విజ్ పోటీల్లో పాల్గొంటూఉంటాడు. అతడికి ల్యాప్ టాప్ కొనే స్థోమత లేదు. దీంతో.. తన ఇబ్బందుల్ని ఏకరువు పెడుతూ రాజ్ భవన్ కు ఒక మొయిల్ చేశారు.
దీనిపై స్పందించిన రాజ్ భవన్.. ప్రదీప్ ను రావాలని ఆహ్వానించాయి. ఊహించని విధంగా గవర్నర్ నుంచి పిలుపు రావటంతోరాజ్ భవన్ కు వెళ్లారు. అతడి గురించి వివరాలు తెలుసుకోవటంతోపాటు.. మంచి భోజనం పెట్టి.. అతడికి అవసరమైన ల్యాప్ టాప్ ను అందజేయటం ద్వారా గవర్నర్ తన పెద్ద మనసును చాటుకున్నారు. తన సమస్యకు రాజ్ భవన్ స్పందించిన తీరు ఆ యువకుడిలో కొత్త స్ఫూర్తిని నింపటమే కాదు.. మరింత కష్టపడటానికి ఊతమిచ్చినట్లుగా చెబుతున్నారు.ఏమైనా మేడమ్ గవర్నర్ గ్రేట్ కదూ!