కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక సందర్భంగా సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వార్తలు వచ్చేస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉన్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగానే రాజకీయ నేతలకు... ప్రత్యేకించి అధికారం వెలగబెడుతున్న పార్టీల నేతలకు సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరమైతే... అధికార పార్టీపై ఉంటుందన్నది జగమెరిగిన సత్యమే. ఇప్పుడు ఆ తరహా పరిస్థితే ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి ఎదురైంది. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు రెండు పర్యాయాలు నంద్యాలకు వెళ్లిన చంద్రబాబు అక్కడ టూర్ షెడ్యూల్ ముగిసినా కూడా రాత్రి పొద్దుపోయే దాకా కూడా మంతనాలే సాగించారు. ఇక మొన్న - నిన్న కూడా చంద్రబాబు అక్కడ పర్యటించి... తన పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు టీడీపీ అధినేతకు ప్రశ్నల వర్షాన్ని వినిపించారు. అసలు ఏం చేశారని మీ పార్టీ అభ్యర్థికి ఓటేయాలో చెప్పాలంటూ కాస్తంత సూటిగానే ప్రశ్నను సంధించారు. ఇప్పుడు ఈ ప్రశ్నల అంశంపై ఆసక్తికర చర్చకు తెర లేసిందనే చెప్పాలి. అసలు నెటిజన్ల ప్రశ్నలకు టీడీపీ గానీ, బాబు కార్యాలయం గానీ సమాధానం చెబుతుందా? అన్న అంశంపై మరింత ఆసక్తికర చర్చ జరుగుతోందట. అయినా చంద్రబాబుకు నెటిజన్లు సంధించిన ప్రశ్నల విషయానికి వస్తే... ఆ జాబితా చాంతాడంత ఉంది. నంద్యాల ఓటర్లతో పాటు రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేస్తున్న సదరు ప్రశ్నల్లో నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలనైతే మనం తెలుసుకోవాల్సిందే.
ఆ తరహా ప్రశ్నలు ఈ కింది విధంగా ఉన్నాయి...
* ఓట్లు వేయలేదని మూడేళ్ల పాటు రాయలసీమకు కనీసం ఎంగిలి చేతులు కూడా విదిల్చకపోగా.. ఓటేస్తేనే మీకేదైనా చేస్తాను. నాకు ఓట్లేయకుంటే రోడ్లమీద తిరగొద్దు.. పింఛన్లు, రేషన్ తీసుకోవద్దు అని బెదిరిస్తున్న వారిని నమ్ముదామా?.. నాయకత్వం కంటే ప్రజలే ముఖ్యం అని నినదించే వాడి పక్షాన నిలబడదామా..?
* విపక్షం గెలిచినా నా ప్రమేయం లేకుండా అభివృద్ధి జరగనివ్వను అనే వాళ్లను విశ్వసిద్దామా?.. అధికారం ఉన్నా లేకపోయినా శక్తివంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తామనే వాళ్లకు ఓటేద్దామా?
* కోట్లు వెదజల్లి విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, కనీసం రాజీనామా చేయమనే ధైర్యం లేని వాళ్లకు ఓటేద్దామా?.. విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ ఒక పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే తమ పార్టీలో చేర్చుకున్న వ్యక్తికి ఓటేద్దామా?
* ‘‘టీడీపీకి ఎందుకు ఓటేయ్యాలి?.. ఒక మంత్రి పదవి కూడా ఇవ్వనందుకు ముస్లింలు టీడీపీ కి ఓటు వేయాలా?
* బ్రాహ్మణులకు ఒక మంత్రి పదవీ ఇవ్వకుండా పైగా నిజాయితీపరుడైన మాజీ చీఫ్ సెక్రటరీ - బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును అవమానించినందుకు ఓటు వేయాలా?
* దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు.. ఎస్టీలకు తెలివి ఉండదు.. అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే దళితులను అవమానిస్తే.. దళితులు శుభ్రంగా ఉండరు - చదువుకోరు - రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటూ ఓ మంత్రి దారుణంగా మాట్లాడినందుకు టీడీపీ కి ఓటు వేయాలా?
* అధికారంలోకి వస్తే 6 నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తాను - ప్రతి ఏడాది వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పి.. హామీలు నెరవేర్చమని ముద్రగడ ఉద్యమిస్తే దారుణంగా అవమానించినందుకు ఓటెయ్యాలా?
* కోడలు మగ పిల్లాడిని కంటానంటే ఏ అత్త వద్దంటుంది అని మహిళల పట్ల చిన్న చూపు చూసినందుకు ఓటు వేయాలా? రాయలసీమ రౌడీలు అని పదే పదే ఒక ప్రాంతాన్ని అవమానిస్తున్నందుకు సీమ ప్రజలు ఓటు వేయాలా?
* సీమకు నీళ్లివ్వకుండా ఎండబెడుతున్నందుకు ఓటు వేయాలా? సీమలో హైకోర్ట్ పెట్టనందుకు ఓటు వేయాలా?
* నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు ఓటు వేయాలా? ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకా? నిరుద్యోగులకు నెలకు 2 వేలు చొప్పున 38 నెలలకు గాను ఒక్కో నిరుద్యోగికి 76 వేలు ఇవ్వనందుకు ఓటు వేయాలా?’’ అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.