కుమారస్వామి కృష్ణా నీళ్లతో మొహం కడుక్కో

Update: 2019-04-10 10:52 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి మిగతా వాళ్లకంటే డిఫరెంట్ కామెంట్లతో వార్తల్లోకి వస్తుంటారు. ఆయన నోటి నుంచి వచ్చే కామెంట్లను సాధారణంగా ఇతర సీఎంల నుంచి వినపడటం అరుదే. గతంలో రెండుమూడు సార్లు ఏడ్చి వార్తల్లోకి ఎక్కాడు. ఆ తర్వాత నా సీఎం సీటుకు గ్యారంటీ లేదు అన్నాడు. ఇలా వెరైటీ కామెంట్లు చేయడంలో ఆయన దిట్ట. తాజాగా మోడీపై ఆయన చేసిన కామెంట్లు ట్రోలర్లకు టన్నుల కొద్దీ ఆనందాన్ని పంచుతున్నాయి.

మోడీ ఎందుకు ఎపుడూ వార్తల్లో ఉంటారనే దానికి కుమారస్వామి తనదైన శైలిలో జవాబిచ్చి వార్తల్లోకి ఎక్కారు. ప్రతిరోజూ పొద్దున లేచిన వెంటనే మోడీ మేకప్ వేస్తారట. అది కూడా వాక్స్ వాడి బాగా మెరిసిపోయేలా మేకప్ వేస్తారట. దీనివల్ల నరేంద్రమోడీ మొహం తళతళా మెరుస్తుంది. అలా చక్కగా తయారై కెమెరాల ముందుకు వస్తారట మోడీ. అందుకే మీడియా కూడా ఆయన ఫొటోల కోసం ఎగబడుతోందట. మరి మాలాంటి ఇతర నాయకుల ఫొటోలు ఎందుకు పెద్దగా పేపర్లో రావు అంటే... పొద్దున లేచి స్నానం చేసినపుడు మాత్రమే మొహం కడుక్కుంటారట. ఇంక మళ్లీ మొహం కడుక్కునేది మరుసటి రోజు ఉదయమేనట. అందుకే మా మొహాలు అంత ఆకర్షణీయంగా ఉండవు. వ్యాక్స్ వల్ల మోడీది మొహం మెరుస్తూ ఫొటోలకు బాగుంటుంది అని వివరించారు కుమారస్వామి.

కుమార స్వామి వ్యాఖ్యలపై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఎందుకు కుమారస్వామి గారు అంత అసూయ ఎందుకు మీకు, మీరు కూడా రోజు రెండు సార్లు కృష్ణా నీళ్లతో మొహం కడుక్కోండి అని ఒకరంటే... చీప్ సీఎం ఆఫ్ అవర్ స్టేట్ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. మీరు మేకప్ వేసినా మోడీలా మెరిసిపోలేరు స్వామి అని ఇంకొక నెటిజన్ నవ్వులు పూయించారు. కుమారస్వామి గారు మీ అడ్రెస్ చెప్పండి... మంచి క్వాలిటీ కాస్ట్లీ మేకప్ కిట్ పంపిస్తాను అని ఇంకో అమ్మాయి సీఎంకి ట్వీటేసింది. మొత్తానికి కన్నడ సీఎం మొదటి విడత ఎలక్షన్ ముందు హీటెక్కిపోయిన బుర్రలకు కాస్త రిలీఫ్ ఇచ్చారు.
    

Tags:    

Similar News