కరోనా ఎఫెక్ట్ : ఓ డాక్టర్ భార్య ఆవేదన .. మద్దతు ప్రకటిస్తున్న నెటిజన్స్ !
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,03,841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8231 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇకపోతే ఈ కరోనా మానవ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. తల్లుల నుంచి బిడ్డలను,భార్యల నుంచి భర్తలను వేరుచేయాల్సిన పరిస్థితి వస్తుంది.అలాగే కరోనా నేపథ్యంలో చివరి చూపులకి కూడా కొంతమంది నోచుకోవడంలేదు. ఇలాంటి సమయంలో మనసులను కలచివేసే కథనాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల క్వారెంటైన్ లో ఉంచిన ఓ చిన్నారి.. గ్లాస్ విండోలో నుంచి చూస్తూ తన తండ్రిని హగ్ కోరగా.. అతను కంటతడి పెట్టుకున్న వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో కరోనా వైరస్ కారణంగా వైద్యుడైన తన భర్తను కుటుంబం ఎంతగా మిస్ అవుతుందో చెబుతూ ఓ మహిళ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ అందరిని మనుషులకి తాకుతుంది. అమెరికాకు చెందిన రాచెల్ పాట్జర్ అనే మహిళ ఆ పోస్ట్ లో.. ఫిజీషియన్ గా పనిచేస్తున్న తన భర్త కరోనా వైరస్ పేషెంట్లకు ఎంత నిబద్దత తో చికిత్స అందిస్తూ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారో తెలిపింది.
తమకు ముగ్గురు సంతానం అని.. ఇటీవలే ఓ బేబీకి జన్మనిచ్చానని తెలిపింది. అయితే కరోనా పేషెంట్లను ట్రీట్ చేస్తున్న కారణంగా, తన భర్త కొన్ని వారాలుగా ఇంటికి రావడం లేదని , కరోనా పేషేంట్స్ కి ట్రీట్ మెంట్ చేస్తున్నారు కాబట్టి అతనికి కూడా వైరస్ సోకే అవకాశం ఉన్నందునా.. తమ అపార్ట్ మెంట్ లోని గ్యారేజ్‌లో అతన్ని ఐసోలేట్ చేసినట్టు తెలిపింది. అలాగే ఇప్పటివరకు ఇటీవలే మాకు పుట్టిన బిడ్డను తన భర్త కనీసం తాకలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలా డాక్టర్స్ ప్రాణాలని , కుటుంబాలని సైతం లెక్క చేయకుండా డాక్టర్లు వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారని.
కానీ ,కొంత మంది ప్రజలు మాత్రం అసలేమీ పట్టనట్టు బార్లకు వెళ్లడం, గుంపు గుంపులుగా చేరి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికైనా కరోనా వైరస్‌ను తీవ్రంగా పరిగణించాలని.. హెల్త్ కేర్ సిబ్బంది పట్ల వారు కృతజ్ఞత తో ఉండాలని తెలిపింది. ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ కి మద్దతుగా కొంతమంది నెటిజన్స్ డాక్టర్లు,హెల్త్ కేర్ సిబ్బందికి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పటికైనా ప్రజలు నిర్లక్ష్య వైఖరిని వీడి ప్రభుత్వాలు, డాక్టర్లు చెబుతున్న సలహాలు సూచనలు పాటించాలని కోరుతున్నారు