దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలకు ముహూర్తం నిర్ణయించేశారు. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణి పూర్ లలో ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఉత్తరాదిన ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని తెలిసి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ చాలా సార్లు యూపీలో పర్యటించారు. మరో వైపు చూస్తే ఉత్తరాది ఎన్నికలు జాతీయ రాజకీయాలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేయనున్నాయి.
దేశానికి రాజకీయంగా గుండెకాయ లాంటి యూపీ ఎన్నికలు అతి ముఖ్యం. అక్కడ అధికారంలో ఉన్న యోగీ సర్కార్ కి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షలు లాంటివే. అదే టైమ్ లో యూపీలో సమాజ్ వాదీ పార్టీ గట్టిగానే ఉంది. ఆ పార్టీ పెద్ద ఎత్తున పుంజుకుంటోంది. మొత్తం 404 అసెంబ్లీ సీట్లు ఉన్న యూపీ జాతకం తేలితే దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని అంతా భావిస్తున్నారు.
అక్కడ సమాజ్ వాదీ పార్టీ కనుక గెలిస్తే దేశంలో మోడీ సర్కార్ కి చిక్కులు తప్పవన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో దేశంలో ఇప్పటికే మోడీని గద్దె దించాలని భావసారూప్య పార్టీలు కలుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు ఇపుడు యూపీలో కనుక ఫలితాలు తారు మారు అయితే యాంటీ మోడీ స్లోగన్ ని ఇంకా పెంచేస్తారు అంటున్నారు.
మరో వైపు చూస్తే యూపీలో బీజేపీకి గడ్డు పరిస్థితే అని సర్వేలు చెబుతున్నాయి. అక్కడ యోగీ సర్కార్ మీద వ్యతిరేకత బాగానే ఉందని, దాన్ని అందుకునేందుకు ఎస్పీ సిద్ధంగా ఉందని కూడా అంటున్నారు. దాంతో యూపీ స్టేట్ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అని తెలిసిపోతోంది.
అదే విధంగా ఉత్తరాఖండ్ లో చూసుకుంటే బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ వరసబెట్టి ముఖ్యమంత్రులను బీజేపీ మార్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పగ్గాలు తీసుకుని నెలలు మాత్రమే అయిన వేళ కమల వికాసాన్ని ఆయన ద్వారా ఆశించడం అత్యాశే అంటున్నారు. డెబ్బై సీట్లు ఉన్న ఉత్తరాఖండ్ లో విజేత గా ఎవరుంటారు అన్నది చూడాలి. ఇక్కడ కాంగ్రెస్ తో బీజేపీ ఢీ కొడుతోంది. ఇద్దరికీ కూడా సరిసమాంగానే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
మూడవది పంజాబ్. ఈ రాష్ట్రం బీజేపీకి గతసారి కూడా హ్యాండ్ ఇచ్చింది. ఇక అప్పట్లో శిరోమణీ అకాలీదళ్ తో పొత్తు ఉండేది, ఇపుడు అదీ లేదు. పైగా తీవ్రమైన వ్యతిరేకతను సాగు చట్టాల విషయంలో బీజేపీ మూటకట్టుకుంది. రీసెంట్ గా ప్రధాని పంజాబ్ టూర్ ని రైతులు అడ్డుకున్నారు. దాంతో ఈ రాష్ట్రంలో బీజేపీకి నో చాన్స్ అనే అంటున్నారు. ఇక్కడ ఆప్ గట్టిగా ఉంది. పవర్ దానిదే అన్న లెక్క కూడా చెబుతున్నారు.
మణిపూర్ లో చూసుకుంటే బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. బీరెన్ సింగ్ నాయకత్వాన పాలన సాగుతోంది. అయితే ఈసారి బీజేపీకి ఎంతమాత్రం అవకాశాలు ఉంటాయన్నది చూడాలి. ఇక్కడ మళ్ళీ కనుక బీజేపీ గెలిస్తే అది రికార్డుగానే చూడాలి. గోవా విషయంలో ఇదే సీన్ ఉంది. ఇక్కడ కూడా బీజేపీకి ఇబ్బందులు తప్పడంలేదు. వరసగా రెండు సార్లు బీజేపీ గోవాను దక్కించుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ఉన్నారు. అయితే ఆయన మూడవసారి అధికారంలోకి పార్టీని తీసుకురాగలడా అన్నది పెద్ద ప్రశ్న.
ఇక్కడ ఆప్ బాగా పుంజుకుంది. దాంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా దూకుడు చేయాలనుకుంటోంది. మొత్తం మీద చూస్తే అయిదు రాష్ట్రాల ఎన్నికలూ కేంద్రంలోని బీజేపీకి అతి పెద్ద పరీక్షనే పెడుతున్నాయి. మరి బీజేపీ ఏ విధంగా నెగ్గుకువస్తుందో చూడాల్సిందే. ఈ మినీ సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 10న తొలి విడతతో ఎన్నికలు మొదలై మార్చి 7 తో ముగుస్తాయి. మార్చి పదిన ఫలితాలు వస్తాయి. ఒక విధంగా దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే ఎన్నికలుగా వీటిని అంతా చూస్తున్నారు.