కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టినంతనే ఒక కొత్త పేరు విపరీతంగా వార్తల్లో నానటమే కాదు.. పెను సంచలనంగా మారింది. మాటల్లో చెప్పలేని దారుణం.. అరాచకత్వానికి పరాకాష్ఠగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉంది. ముస్లిం మహిళల్ని టార్గెట్ చేసి వికృతకాండకు వేదికగా మారింది ‘బుల్లీ బాయి’. ఇంతకూ ఏమిటీ బుల్లి బాయి అంటే.. అదో యాప్. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే ఈ యాప్ ను యుద్ధ ప్రాతిపదికన మూయించేశారు.
ఇంతకూ ఈ యాప్ లో ఏముంటుందన్న విషయంలోకి వెళితే.. ఇందులో ముస్లిం మహిళల ఫోటోల్ని వారి అనుమతి లేకుండా అప్ లోడ్ చేశారు. అంతేకాదు.. డీల్ ఆఫ్ ది డే పేరుతో వేలం నిర్వహించేవారు. సదరు మహిళల ఫోటోలపై మాటల్లో చెప్పలేనంత దారుణ రాతలు రాయటం.. అభ్యంతరకర పోస్టులు.. కామెంట్లతో నిండి ఉంటాయి. ఇందులో ముస్లిం మహిళలే ఉండటం.. వారంతా సోషల్ మీడియాలో ముస్లింల వాణిని.. మహిళల వాదనను బలంగా వినిపించే వారే కావటం గమనార్హం.
దీని వ్యవహారం చూస్తుంటే.. ఇదంతా కావాలనే.. పక్కా ప్లాన్ తో చేస్తున్నారే తప్పించి.. అనుకోకుండా చేసిందేమీ కాదు. సోషల్ మీడియాలో ఎవరైతే ధైర్యంగా మాట్లాడతారో.. వారినే లక్ష్యంగా చేసుకొని వారి ఫోటోలతో ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారు. దీనిపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ యాప్ భాగోతం బయటకు వచ్చింది. ఈ యాప్ లో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారిని ఉద్దేశించి ఎంత దారుణమైన పోస్టులు పెట్టారనటానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ యాప్ గురించి వివరాలు తెలసుకునే వేళ.. మరో కొత్త విషయాన్ని గుర్తించారు. ఈ బుల్లీ బాయికు ముందు.. ఇదే తరహాలో సుల్లీ డీల్స్ అనే యాప్ పని చేసేది. ఆరు నెలల ముందు బుల్లీ బాయి మాదిరి ముస్లిం మహిళల ఫోటోలు ఉండటం.. వారిని వేలం వేయటం.. దారుణ కామెంట్లు పెట్టటం లాంటివి చేసేవారు. దాన్ని డిలీట్ చేసిన తర్వాత.. అదే తరహాలో పేరు మార్చి మళ్లీ మొదలు పెట్టారు. ఇంతకీ ఈ అభ్యంతరకర యాప్ ఎలా బయటకు వచ్చింది? ఎవరు అప్ లోడ్ చేశారు.. లాంటి అంశాలపై ఫోకస్ పెట్టినప్పుడు మరింత విస్మయకర అంశాలు వెలుగు చూశాయి.
విచిత్రమైన విషయం ఏమంటే సుల్లీ డీల్స్.. బుల్లీ బాయి రెండుయాప్ లను మైక్రోసాఫ్ట్ వారి ‘‘గిట్ హబ్’’ ఇంటర్నెట్ హోస్టింగ్ ప్లాట్ ఫారమ్ మీద తయారైనట్లుగా గుర్తించారు. ఏమిటీ గిట్ హబ్ అంటే.. మైక్రోసాఫ్ట్ వారి వేదికగా చెప్పొచ్చు. గిట్ హబ్ అన్నది ఇంటర్నెట్ హోస్టింగ్ ప్లాట్ ఫారమ్. దీన్ని వినియోగించుకొని వినియోగదారులను రకరకాల యాప్ లను పొందే అవకాశం ఉంది. ఇది గూగుల్ ప్లే స్టోర్ తరహాలోనిది. గిట్ హబ్ ను ఉపయోగించుకొని యాప్ లను క్రియేట్ చేసుకోవటానికి లేదంటే దాన్ని భాగస్వామ్యం చేసుకోవటానికి అనుమతిని ఇస్తుంది.
2008లో అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోలో దీన్ని ప్రారంభించారు. దీని ప్రస్తుత సీఈవో థామస్ డోమ్కే. అయితే.. ఈ రెండు యాప్ లను ఎవరు తయారు చేశారన్న దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. సుల్లీ డీల్స్ మీద దుమారం రేగటం.. దాన్ని డీలీట్ చేయటంతోపాటు.. దానికి బాధ్యులు ఎవరన్న దానిపై పోలీసు విచారణ జరుగుతోంది. కానీ.. ఇప్పటివరకు దానికి కారణమైన వారి ఆచూకీ లభించలేదు. అంతలోనే బుల్లీ బాయి యాప్ ఉదంతం బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయించి.. విచారిస్తున్నారు. మరి.. అసలు నిందితుడు ఎవరో తేలే లోపు.. ఈ తరహా దారుణ యాప్ లు మరెన్ని వస్తాయో?