ఒక నిష్ఠూరం.. అలా జరిగితే బాగుండదన్న భావన.. అలా అని నేరుగా చెప్పేస్తే బాగోదు.. ఇలాంటి సందిగ్థత వేళ.. మనసులో ఉన్నది చెప్పకుండా ఉండలేక.. తన్నుకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవాలన్న చాలామంది కాంక్షకు ప్రతి రూపంగా కుప్పంలోని టీడీపీ కార్యకర్త నోటి నుంచి ప్రశ్న రూపంలో వచ్చింది. నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలం పెద్ద తండాలో ఒక యువకుడు చంద్రబాబును అనూహ్యమైన ప్రశ్నను సంధించటం తెలిసిందే.
సార్.. వచ్చే ఎన్నికల్లో మీరు పవన్ కల్యాణ్ పార్టీతో కలిసి పోటీ చేస్తారా? అని ప్రశ్నిస్తే.. చంద్రబాబు ఇచ్చిన ఆన్సర్ ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. లవ్ ప్రపోజ్ చేసినట్లుగా ఉండటం గమనార్హం. అవును.. లేదు.. అంటూ సింఫుల్ గా తేల్చేయొచ్చు. కానీ.. తన మనసులో ఉన్న భావాన్ని చెప్పేందుకు ఆయన వినియోగించుకున్నారని చెప్పాలి. చంద్రబాబు సమాధానం చూసినప్పుడు.. ‘తమ్ముడూ.. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావనుకుందాం. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించాలి కదా. ఏకపక్షంగా ప్రేమించలేం కదా’ అని సమాధానం ఇచ్చారు.
బాబు మాటల్ని చూస్తే.. పవన్ పార్టీపై తనకున్న లవ్ ను చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. అలా అని.. తనకున్నప్రేమ..పవన్ కు ఉండాలని లేదు కదా? అని స్పష్టం చేయటం ద్వారా.. తాను పొత్తు డీల్ కు రెఢీ అన్న స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉన్న వేళ.. పవన్ మనసును టచ్ చేసే మాటల్నిబాబు సంధించారని చెప్పాలి. ఇప్పటికిప్పుడు కాకున్నా.. తాను ఓపెన్ గా ఉన్నానన్న సందేశాన్ని బాబు తన సమాధానంతో చెప్పేశారు.
రేపొద్దున్న కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటే.. తాను సిద్ధంగా ఉన్నాన్న విషయాన్ని చెప్పేయటం ద్వారా.. బంతి పవన్ కోర్టులో పడేశారని చెప్పాలి. పొత్తుపై తన ప్రపోజల్ ను తాజా వ్యాఖ్య ద్వారా చెప్పేశారని చెప్పాలి. పొత్తు విత్తుల్ని ప్రపోజల్ లో నాటేసిన చంద్రబాబు ప్రయత్నానికి.. ఎలాంటి పంట వస్తుందన్నది ఫ్యూచర్ తేల్చాలి.