సంక్రాంతి పండగ వచ్చిందంటే కోళ్ల పందేల చుట్టూనే ప్రపంచమంతా తిరుగుతుంటుంది. ఈ పందేలు నిర్వహించటం, కాయటమన్నది దశాబ్దాలుగా జరుగుతున్నదే. అలాంటి పందాలు నిలిపేయాలంటు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేశారు బాగానే ఉంది నిజంగా ఇది సాధ్యమేనా ? జనాల్లో మార్పు రానిదే ఏ చట్టం దేన్ని అడ్డుకోలేదు. కోళ్ళ పందేలను అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే పందేలనగానే ప్రజా ప్రతినిధులంతా ఏకమైపోతారు కాబట్టే.
మామూలుగా వివిధ పార్టీల్లోని నేతల మధ్య రాజకీయ వైరం ఎంతలా ఉన్నా సంక్రాంతి సందర్భంగా కోళ్ళపందేలంటే మాత్రం ఏకమైపోతారు. ఎక్కడెక్కడి నేతలు సంక్రాంతి బరుల్లోకి దిగేస్తారు. అందుకనే పోలీసులు కూడా ఎవరినీ ఏమీ చేయలేకపోతున్నారు. కోళ్ళ పందేల్లో కేవలం ప్రతిపక్షాల నేతలు మాత్రమే నిర్వహిస్తారని, ప్రతిపక్ష నేతలు, మామూలు జనాలు మాత్రమే పాల్గొనేట్లయితే పోలీసులు వీటిని చాలా ఈజీగా కంట్రోల్ చేసేయగలరు.
కానీ అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలంతా కలిసే బరుల్లో దిగుతారు. బరుల్లో దగ్గరుండి మరీ పందేలాడుతారు, పందేలను ప్రోత్సహిస్తారు. స్వయంగా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులే బరుల్లో పాల్గొంటున్నపుడు పోలీసులు ఏమీ చేయగలరు ? కోళ్ళపందేలనే కాన్సెప్టు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, వైజాగ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. వారం రోజుల పాటు వందల కోట్లలో పందేలు, బెట్టింగులు జరుగుతాయి.
కోళ్ళ పందేలు నిర్వహించటం, పాల్గొనడం ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రిస్టేజిగా ఫీలవుతుంటారు. కొత్త అల్లుళ్ళని పండుగకు ఆహ్వానించటం, పందేల బరుల్లోకి తీసుకెళ్ళటాన్ని గోదావరి జిల్లాల్లోని ప్రముఖులు ప్రిస్టేజిగా ఫీలయినపుడు పందేలను వద్దంటే ఊరుకుంటారా ? పందేలు ఏ కారణంతో అయినా నిర్వహించలేకపోతే దాన్ని పెద్ద అవమానంగా ఫీలవుతారు ఆ ఊరిలోని పెద్దలు. అందుకనే కోడిపందేల నిర్వహణను అంత ప్రిస్టేజిగా తీసుకుంటారు.