నిశ్శబ్దం ఎంతో భయంకరం అంటారు. అదే సమయంలో అదే ఎన్నో ఊసులను చెబుతుంది అని అంటారు. మౌనమే నా భాష అర్ధం చేసుకోమని కూడా చెబుతారు. మరి వారి బాటే అదే అనుకోవాలి. అందుకే మాట కంటే మౌనమే శరణ్యం అంటున్నారు. ఇంతకీ ఎవరు వారు అంటే టీ కాంగ్రెస్ లో ఉన్న అధికార ప్రతినిధులుట. వీరు ఒకరిద్దరు కాదు, ఏకంగా డజన్ దాకా ఉన్నారు. అయితే వీరెవరూ ఇపుడు పెద్దగా చప్పుడు చేయడంలేదని టాక్.
పలుకే బంగారమా అన్నట్లుగా తయారయ్యారుట. రాజకీయ నాయకుడికి మాటలే ఆయుధం. వాటితోనే కాచుకోవాలి, వాటినే ముందు పెట్టి దాడి చేయాలి. కానీ టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాత్రం అందుకు భిన్నం. మేము మాట్లాడితే ఒట్టు అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ జాతీయ పార్టీ. దాని విధానాలను ప్రతీ రోజూ జనంలో పెట్టి చర్చను తీసుకురావాలి. అదే విధంగా తెలంగాణాలో గత రెండు టెర్ములుగా అధికారంలో కాంగ్రెస్ లేదు.
ఈసారి కనుక పవర్ లోకి రాకపోతే ఉనికే టోటల్ గా గల్లంతు. అయినా కూడా ఈ నేతాశ్రీలు అసలు సౌండ్ చేయడం లేదు అంటే ఆలోచించాల్సిందే మరి. తెలంగాణా చల్లగా ఉందా. సమస్యలు అన్నవి లేవా అంటే చూడాలే కానీ గల్లీగల్లీలో బొచ్చెడు సమస్యలు ఉంటాయి. అలాగే పార్టీకి ఒక పాలసీ వుంది. ఇక తెల్లారిలేస్తే ఎవరో ఒక నాయకుడు కాంగ్రెస్ మీద నోరు చేసుకుంటాడు.
ఇలా అన్నింటిమీద రియాక్ట్ కావాల్సింది అగ్ర భాగాన ఉండాల్సింది అధికార ప్రతినిధులే. కానీ అలా జరగడంలేదు అనే అంటున్నారు కాంగ్రెస్ పెద్ద తలకాయలు. ఉన్న అధికార ప్రతినిధులలో ఎక్కువ మంది ఉత్సవ విగ్రహాల మాదిరిగా మారిపోయారని అంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక చేసిన పని ఏంటి అంటే అధికార ప్రతినిధులను నియమించడమే.
వారిలో కూడా సీనియర్లను ఎక్కువగా తీసుకున్నారు. అలాగే మంచి మాటకారులను కూడా తీసుకున్నారు. వీరంతా అధికార పార్టీ టీయారెస్ విధానాల మీద దండెత్తాల్సింది పోయి గమ్మున ఉండడమే పార్టీ పెద్దలకు అర్ధం కావడంలేదు అంటున్నారు. టీవీ చర్చల్లో అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ వంటి వారు కనిపిస్తున్నారు. ఇక మరో ప్రతినిధి సిరిసిల్ల రాజయ్య అంతంత మాత్రం అంటున్నారు. అలగే హరివర్ధన్ రెడ్డి వంటి వారు కూడా కనిపించడంలేదు, వినిపించడం లేదు అంటున్నారు.
మరి ఇలాగైతే ఎలాగా అంటోంది గాంధీ భవన్. వచ్చే ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. అదే విధంగా చూసుకుంటే పార్టీని ఇప్పటి నుంచే స్పీడప్ చేయాలి. జనం నోళ్లల్లో కాంగ్రెస్ గట్టిగా నానాలి. దానికి ఇంధనంగా అధికార పార్టీ ప్రతినిధులే ఉండాలి. కానీ జరుగుతోంది వేరుగా ఉంది. ఇలాగే ఊరుకుంటే స్పోక్స్ పర్సన్స్ గాయబ్ అవుతూంటే కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణాలో ఏంటి అన్నది మాత్రం అర్ధం కాని విషయమే అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో అన్ని స్థాయిల్లో ప్రక్షాళన అవసరమేమో అన్నది ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి అంటున్నారు.