వరుసగా రెండు సార్లు అధికారంలో వచ్చి.. అది కూడా రెండో సారి అఖండ్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. తెలంగాణలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్). తొలిసారి సర్కారులో కాళేశ్వరం నీరు పారించి ప్రజల అభిమానం చూరగొంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. రైతు బంధు ఆలోచనతో అన్నదాతల ఆదరణ చూరగొని అధికార పీఠం అలంకరించింది.
వాస్తవానికి తెలంగాణ ఏర్పాటుతో పాటే జరిగిన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ చాలా కష్టంగా మెజారిటీ సాధించింది. అయితే, అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం ‘హస్తగతం’కాకుండా తనవైపు లాక్కుంది. ముఖ్యంగా కేసీఆర్ ఆలోచనాపరుడైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడంతో తొలి విడత పాలన సజావుగా సాగింది. సర్కారు ఏం చేసినా..దానిని కొత్త రాష్ట్రం సెంటిమెంట్ కు ముడిపెడుతూ మందుకుసాగడంతో ప్రజల నుంచి కూడా మూకుమ్మడిగా మద్దతు లభించేంది. ఇక అధికారం దన్నుతో ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకున్నా.. ప్రజలు ఆమోదించారు. చాలామంది ప్రజాప్రతిధులు ఇతర పార్టీల నుంచి రాత్రికి రాత్రే టీఆర్ఎస్ లో చేరినా, దానిని రాజకీయ పునరేకీకరణ అనుకున్నారే గానీ.. ఫిరాయింపుగా భావించలేదు. అందుకే ప్రతిపక్షాలు మహా కూటమి కట్టినా మొదటిసారి సాధించిన వాటి కంటే రికార్డు స్థాయి స్థానాలు కట్టబెట్టారు.
జిల్లాకో వివాదాస్పదుడు..వరుసగా రెండోసారి అధికారంలో ఉండడం, సీఎం కేసీఆర్ సైతం ప్రజా సమస్యల కోణంలో ఆలోచించి స్వేచ్ఛ ఇవ్వడంతో శాసన సభ్యులకు హద్దు లేకుండా పోతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకో వివాదాస్పద ఎమ్మెల్యే పుట్టుకొస్తున్నారు. నియోజకవర్గాల్లో వారు చేస్తున్న హల్ చల్ రాష్ట స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఇది పార్టీకీ, ప్రభుత్వానికీ ఒకింత ఇబ్బందికర పరిస్థితి తెస్తూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులో, చర్యలు తీసుకోవాల్సినంత అవసరమో వస్తోంది.
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్ లో అటవీ శాఖ అధికారులతో ఓ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వ్యవహరించిన తీరు సంచలనం రేపింది. అటవీ భూముల విషయంలో ప్రజల ప్రయోజనాలు ఎలా ఉన్నా.. నిబంధనల ప్రకారం నడుచుకోవడం ముఖ్యం. కానీ, ఇందుకు భిన్నంగా జరగడం.. దాడులు చోటుచేసుకోవడం వివాదాస్పమైంది. ఇక కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్రాన్నే కాదు.. దేశాన్నీ కుదిపేసింది. నడి రోడ్డుపై న్యాయవాద దంపతుల దారుణ హత్య కుదిపేసింది. ఈ విషయంలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే.. సమీప బంధువులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. హత్యకు గురైంది న్యాయవాద దంపతులు కావడంతో విషయం మరింత పెద్దదైంది. చివరకు ఎలాగొలా సద్దుమణిగి వార్తల్లో లేకుండా పోయింది. నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యేది మరో తీరు. భూ ఆక్రమణలకు పేరుగాంచిన ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అఖిల పక్షం పోరాడింది. ఈయన చేసిన ఆక్రమణల కారణంగానే నియోజకవర్గ కేంద్రం ముంపునకు చేరిందనే ఆరోపణలున్నాయి. వరంగల్ జిల్లాలో మరో ఎమ్మెల్యే అధికశాతం మంది ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి తర్వాత వెనక్కుతగ్గారు. చివరకు ఆయన కూడా ఆధ్యాత్మిక బాట పట్టడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. పాలమూరు జిల్లాలోనూ ప్రధాన స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతపై తీవ్ర స్థాయి ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ పెద్దగా వెలుగులోకి రాకపోవడంతో తుస్సుమన్నాయి.
నిజామాబాద్ జిల్లాలో కొందరు ఎమ్మెల్యే ల ప్రవర్తనా తీరు, వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. వ్యక్తిగతంగానూ వారికి మంచి పేరు లేకపోవడం గమనార్హం. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడి ధోరణి ఎంతటి సంచలనం రేపుతుందో అందరికీ తెలిసిందే. చివరకు సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యే కుమారుడిపై చర్యలకు ఆదేశించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ పలువురు శాసనసభ్యుల తీరు వివాదాస్పదం అవుతోంది. అయితే, నగర వాతావరణం నేపథ్యంలో ఇవేవీ వెలుగులోకి రావడం లేదు.
పెద్ద సారు.. చిన్న సారు బాగున్నా.. కిందివారు దెబ్బతీస్తుంటే ఎలా..? బలమైన ప్రతిపక్షం లేకపోవడం గానీ, ఇతర పార్టీల నాయకత్వం ఇంకా పుంజుకుంటున్న దశంలో ఉండడం వల్లనైతే గానీ వాస్తవానికి ప్రభుత్వ పరంగా చూస్తే టీఆర్ఎస్ కు ఇప్పటికీ మొగ్గు ఉంది. అది కేసీఆర్ నాయకత్వం కావొచ్చు.. మంత్రి కేటీఆర్ చురుకుదనం కావొచ్చు.. ఓవరాల్ గా సర్కారుకు మంచి పేరే ఉంది. విధానాలు బాగుండడం.. అవినీతి పరంగానూ ఆస్కారం లేకపోవడంతో ఇంకాస్త మెరుగ్గా ఉంచుతోంది. కానీ, క్షేత్ర స్థాయిలో తేడా జరుగుతుండడంతో మొత్తానికే మోసం అనిపిస్తోంది. 1999-2004 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. అందుకే ఆ తదుపరి ఎన్నికల్లో ఓటమిపాలైంది. టీఆర్ఎస్ విషయంలోనూ అలా జరగకూడదనుకుంటే... కేసీఆర్ సారూ.. పారాహుషార్. అసలే బండి సంజయ్, రేవంత్ రెడ్డి రూపంలో ప్రధాన ప్రతిపక్షాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు రెండేళ్లు కూడా లేనందున.. ఇకపై ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం ఆచితూచి సాగాల్సిందే.