మొత్తానికి రెబెల్ ఎంపీ రఘూరామక్రిష్ణంరాజు వైసీపీకి సరైన షాకే ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. తన రాజీనామాను కోరుకుంటున్న వైసీపీ అధినాయకత్వం ముచ్చట తీర్చబోతున్నారు. అయితే వారు కోరుకున్న టైమ్ లో కాదు, తనకు నచ్చిన టైమ్. తనకు అచ్చి వచ్చిన టైమ్ లో రాజీనామా చేసేసి బస్తీమే సవాల్ రా చూసుకుందామని చెప్పబోతున్నారు. రఘురామ వైసీపీతో విడాకులు తీసుకోవడానికి మనసా వాచా కర్మేణా రెడీగా ఉన్నారు. ఆయనకు ఇపుడు కరెక్ట్ ముహూర్తం కుదిరింది. అందుకే రాజీనామా చేసేస్తాను, కాచుకోండి అంటున్నారు.
ఈ ఏడాది మే నాటికి వైసీపీ సర్కార్ పాలనకు మూడేళ్ళు నిండుతాయి. రఘురామ సరిగ్గా ఆ టైమ్ ని ఎంచుకుని వేసవిలో సరికొత్త రాజకీయ మంటలు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఆయన తొందరలో రాజీనామా చేస్తే కనుక మే లో నర్సాపురానికి ఉప ఎన్నికలు వచ్చే చాన్స్ ఉంది. ఆ ఎన్నికల్లో రఘురామ తిరిగి పోటీ చేస్తారు. ఆయన బీజేపీ నుంచి బరిలో నిలబడవచ్చు అని అంటున్నారు.
ఈ మేరకు ఆయన రెండు రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాను కలుసుకుని చర్చించారని తెలుసొతోంది. బీజేపీ గ్రీన్ సిగ్నల్ తీసుకునే ఆయన రాజీనామా అంటున్నారు. మరి ఆయన పోటీ పడితే నర్సాపురంలో టీడీపీ కూడా మద్దతు ఇస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ తో కూడా ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఆ పార్టీ కూడా భేషరతుగా రఘురామ రాజుకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే మొదటి నుంచి తెలుగుదేశానికి బలం ఉంది. అలాగే జనసేనకు కూడా అక్కడే పట్టుంది. ఇక బీజేపీ కూడా 2014 ఎన్నికల్లో నర్సాపురం నుంచి గెలిచింది. ఆ పార్టీకి కూడా బేస్ బాగానే ఉంది. ఇది రాజకీయంగా చూసుకుంటే రఘురామకు కలసివచ్చే అంశం.
సామాజికవర్గాల పరంగా చూసుకుంటే ఈ సీటు నుంచి ఎక్కువ సార్లు ఎంపీగా గెలిచించి క్షత్రియులే. వారికి అక్కడ కులాలకు అతీతంగా బలం ఉంది. ఆ తరువాత కాపులు కూడా గెలిచారు. అయితే రఘురామ వర్సెస్ వైసీపీగా సాగిన పోరులో ఆయనని అన్యాయంగా పుట్టిన రోజు పూటా అరెస్ట్ చేసి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అన్న దాని మీద క్షత్రియ సామాజికవర్గం పూర్తి యాంటీగా ఉందని అంటున్నారు.
అదే విధంగా విజయనగరం పూసపాటి వంశీకుడు అశోక్ గజపతిరాజుని కూడా మాన్సాస్ చైర్మన్ పోస్ట్ నుంచి తొలగించిన తీరు పట్ల కూడా క్షత్రియులు మండిపడ్డారని టాక్. ఆయన ఇపుడు న్యాయపోరాటం ద్వారా ఆ పదవిని తెచ్చుకున్నా వైసీపీ వారు టార్గెట్ చేయడం పట్ల క్షత్రియుల నుంచే వ్యతిరేకత ఉంది.
మరో వైపు కాపులు కూడా గత ఎన్నికల్లో వైసీపీ జనసేన, టీడీపీల మధ్య చీలిపోయారు. దాంతో వైసీపీకి ఎక్కువ సీట్లు దక్కాయి. ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తులతో వైసీపీకి కొంత దెబ్బ పడింది. అయితే అవి చిన్న ఎన్నికలు కాబట్టి సరిపోయింది. ఇపుడు నర్సాపురం లాంటి ఎంపీ సీటుకు ఉప ఎన్నిక అంటే అంతా ప్రతిష్టగానే తీసుకుంటారు.
పైగా రాజుకు జనసేన మద్దతు ఇస్తే కనుక కాపులు కచ్చితంగా మెజారిటీ సెక్షన్ ఆయన వైపే ఉంటారు. ఇది సామాజికపరంగా చూడాల్సిన అంశం. ఇక పాలనాపరంగా చూసూంటే ఉప ఎన్నికల నాటికి వైసీపీది మూడేళ్ళ పాలన పూర్తి అవుతుంది. దాంతో ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంటుంది. రాజకీయ చైతన్యానికి ప్రతీకలుగా గోదావరి జిల్లాలను చెప్పుకుంటారు.
దాంతో వైసీపీ మీద తొలి దెబ్బగా భారీ ఓటమికి నర్సాపురం వేదిక అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరో వైపు చూసుకుంటే వైసీపీలో రఘురామను ఢీ కొట్టే నాయకుడు ఎవరూ లేరనే అంటున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన గోకరాజు గంగరాజు ఫ్యామిలీని వైసీపీ చేర్చుకుని వారిని నర్సాపురం పార్లమెంట్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించినా వారు పెద్దగా యాక్టివ్ గా లేరని చెబుతున్నారు.
మరో వైపు కాపుల నుంచి క్యాండిడేట్ ని తెచ్చి పెట్టాలనుకున్నా ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో తెలియదు. మొత్తానికి రఘురామ అన్నీ చూసుకునే జగన్ కి పెను సవాల్ విసురుతున్నారు. నర్సాపురంలో వైసీపీ ఓడడానికి అవకాశాలు అయితే ఎవరూ కొట్టిపారేయలేరు. ఒకవేళ అన్ని శక్తులూ మోహరించి గెలిచినా కూడా అది బొటాబొటీగానే ఉందే చాన్స్ ఉంది. అపుడు కూడా ఇదిగో ప్రజా వ్యతిరేకత జగన్ మీద వెల్లువలా పాకుతోంది అని చెప్పడానికి చాన్స్ ఉంటుంది. మొత్తానికి రఘురామ రాజీనామా చేస్తే కనుక వైసీపీకి వేసవిలో ఉక్క బోత తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి.