ఇప్పుడంతా కరోనా వైరస్ గురంచిన చర్చే. కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా సోకితే ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి? అసలు కరోనాను ఎలా జయించాలి? అన్న అంశాలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రముఖులు అనుకున్న కొందరు వ్యక్తులు మంచి సలహాలు ఇస్తుంటే... మరికొందరు తమదైన రీతిలో చికిత్సలు సూచిస్తూ జనానికి అడ్డంగా బుక్కైపోతున్నారు. ఇలాంటి రెండో కోవలోకి ఇప్పుడు తెలంగాణలో సీనియర్ రాజకీయవేత్త, టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చేరిపోయారు. కరోనాకు తనదైన చికిత్స చెప్పేసిన ఎర్రబెల్లిపై ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైపోయింది.
అయినా కరోనాకు విరుగుడు ఇదేనంటూ ఎర్రబెల్లి ఏం చెప్పారంటే... ‘‘కరోనా వచ్చి పడిశంలో, గొంతులో ఉంటే శరీరానికి ఎక్కుతుంది. జ్వరం, జలుబు లేకపోతే కరోనా కడుపులోకి పోతుంది. మన కడుపులో మిషన్ మంచిది. బొక్కలు(ఎముకలు), సిమెంట్ వంటి వాటిని కూడా నమిలిపెడుతుంది. కాబట్టి కడుపులోకి కరోనా పోతే పిప్పి పిప్పి అయ్యి బయటకు వస్తుంది’’ అని ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు. గొంతులో, ముక్కులో శరీరంపై కరోనా ప్రభావం చూపుతుందన్న ఎర్రబెల్లి…వేడి నీటి ద్వారా కడుపులోకి వెళ్తే.. ఇబ్బందేం ఉండదంటూ సెలవిచ్చారు.
కరోనాకు విరుగుడు ఇదేనంటూ ఎర్రబెల్లి ఇలా కామెంట్స్ చేశారో, లేదో... అలా ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. డాక్టర్ ఎర్రబెల్లి…ఎంబీబీఎస్, ఎండీ, ఎఫ్ ఆర్సీఎస్, చైనా వచ్చేశారని…ఇక కరోనా పారిపోతుందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ఎర్రబెల్లి ఉండగా కరోనా గురించి భయమెందుకు దండగా’ అంటూ మరో నెటిజన్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఎర్రబెల్లి దెబ్బకు గజగజ వణికిపోతోన్న కరోనా అంటూ ఓ రేంజ్ లో సెటైర్లు, మీమ్స్ పేలుతున్నాయి. బెల్లీ థియరీతో ఎర్రబెల్లి లొల్లి అంటూ మరికొందరు నెటిజన్లు పంచ్ లు వేస్తున్నారు. మొత్తంగా కరోనాకు విరుగుడు చెప్పిన ఎర్రబెల్లి అడ్డంగా బుక్కైపోయారన్న మాట.