కేటీఆర్ పై భక్తి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ట్రోలింగ్

Update: 2020-08-19 17:36 GMT
తెలుగు రాష్ట్రాలపై తాజాగా భారీ వర్షాలు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఈ వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలమైంది. నడుం లోతు నీటిలో మునిగింది. ఇసుక కొట్టుకొచ్చి వాహనాలను కప్పేసింది. వరంగల్ వరద చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ స్పందించి వరంగల్ లో పర్యటించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పి రూ.25 కోట్ల తక్షణసాయం ప్రకటించారు. అందరికీ నిత్యావసరాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

అయితే మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు, స్థానిక ఎమ్మెల్యేల హడావుడి ఎక్కువైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అయితే ఏకంగా ‘రాముడి రాకతో ఉదయించిన భాస్కరుడు.. ఆస్తమించిన వరుణుడు.. మంచివారు వస్తే కాలం కూడా కలిసివస్తుంది’ అంటూ కేటీఆర్ రాకను ఆకాశానికి ఎత్తేశాడు.

అప్పటికే భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న జనానికి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ట్వీట్ మంటపుట్టించింది. దీంతో ఎమ్మెల్యేపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘కేటీఆర్ ను ముందే రమ్మంటే ఈ వరదలు వచ్చేవి కాదు కదా’ అని కొందరు సెటైర్లు వేశారు. కేటీఆర్ ను హైదరాబాద్ వదిలేసి వరంగల్ లో ఉంచాలని మరికొందరు.. హైదరాబాద్ లో కేటీఆర్ ఉండబట్టే వానలు అక్కడ పడడం లేదా అని మరికొందరు.. ఇలా ఎవరికి వారు సోషల్ మీడియాలో ఎమ్మెల్యేనే ఏసేసుకున్నారు. కేటీఆర్ ను సూర్యడంటున్నారు.. ఇక్కడే ఉంచితే ఈ వరద ఆవిరి అవుతుందంటూ కొందరు సెటైర్లు వేశారు. ఇలా ధాస్యం స్వామి భక్తికి సోషల్ మీడియాలో తగిన శాస్తి జరిగిందని వరంగల్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. వరదలో మేము చస్తుంటే కీర్తనలు ఆలపిస్తావా అని ఎమ్మెల్యే తీరును బాగానే కడిగేశారట..
Tags:    

Similar News