అయ్యా మంత్రి మల్లారెడ్డి ఏంటయ్యా ఇది ?

Update: 2020-05-21 11:10 GMT
టీఆర్ ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి నోరు జారారు. పొరబాటున తన మామ అయిన చామకూరి మల్లారెడ్డిని మంత్రి అని సంబోదించబోయి,ఏకంగా ముఖ్యమంత్రి అని పిలిచారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న మల్లారెడ్డిని ఆయన అల్లుడు ముఖ్యమంత్రి అని సంబోధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. మీడియాను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో రాజశేఖర్ రెడ్డి తన మామను ఏకంగా ముఖ్యమంత్రిని చేసాడు.

అసలు విషయం ఏమిటంటే .. మేడ్చల్ ఓఆర్ ఆర్ వద్ద వలస కార్మికులకు భోజనాలు, వసతి సౌకర్యాలు కల్పిస్తూ.. వారిని స్వస్థలాలకు పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేసిన కృషిని ప్రశంసిస్తూ ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ నోరు జారాడు. దీనితో కేసీఆర్ పదవి నుంచి దిగిపోయారా..? మంత్రి మల్లారెడ్డి సీఎం ఎప్పుడయ్యారు? అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా తన మామ పై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి గత లోక్‌ సభ ఎన్నికల్లో దేశంలోని అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజ్ ‌గిరి నుంచి టీఆర్ ఎస్ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. చూడాలి మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో ..
Tags:    

Similar News