కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా సామజిక దూరం తప్పనిసరిగా , పాటించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒకే ఇంట్లో ఉన్నవారు కూడా సామజిక దూరం పాటించారు. భార్య , భర్తలు కూడా దగ్గర కాలేకపోయారు. ఈ విషయాన్ని మాజీ సీఎం తన రసిక హాస్య చతురత చాటుతూ చెప్పారు. అయన మరెవరో కాదు .. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది.
తాజాగా ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. 84 ఏళ్ల వయసులో కూడా ఫరూఖ్ అబ్దుల్లా తనలోని రసిక హృదయాన్ని బయటపెట్టారు. ఇంతకీ అయన ఏమన్నారు అంటే .. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడైన ఫరూఖ్ అబ్దుల్లా జమ్మూలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కరోనా మహమ్మారి కారణంగా తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోతున్నట్టు మహమ్మారిపై చమత్కారం ప్రదర్శించారు.
కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా జనం భయపడే పరిస్థితిలో ఉన్నామని , కౌగిలించుకోవాలని హృదయం కోరుతున్నా అలా చేయలేకపో తున్నాం. ఇతరులతో కరచాలనం చేస్తే, కౌగిలించుకుంటే ఏం జరుగుతుందోనని అందరూ భయపడుతున్నారు. నేను నా భార్యకు కనీసం ముద్దు కూడా పెట్టలేకపోతున్నా. అలాగే నేను మాస్కు ధరించకుండా ఉన్న ఫొటో నా కూతురి కంటపడితే ఇంటికెళ్లాక ఇక నా పని అయిపోయినట్లే అని ఫరూఖ్ అన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా బ్రిటన్‌కు చెందిన మోలీని వివాహం చేసుకున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఫరూఖ్ అబ్దుల్లా కొంత కాలం బ్రిటన్‌లో తన సేవలు అందించారు. ఫరూఖ్ అబ్దుల్లా మాటలు విన్న ప్రేక్షకులు పడి పడి నవ్వుకున్నారు.