తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టడానికి.. దాని లూప్ హోల్స్ బయటకు తీయడానికి ప్రత్యర్థులంతా కాచుకొని కూర్చున్నారని అర్థమవుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ తరుఫున రిటైర్డ్ ఐఎఎస్ రత్న ప్రభ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె తన కులానికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచారు.
ప్రత్యర్థులు ఇప్పుడు రత్నప్రభపై కొత్త వివాదం తీసుకొచ్చారు. రత్నప్రభ మతాన్ని తవ్వితీసి ఆమె క్రైస్తవ మతానికి చెందిన వారని సోషల్ మీడియాలో ఆధారాలతో ప్రచారం చేస్తున్నారు. ఆమె షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) నుంచి క్రైస్తవ మతంలోకి మతంలోకి మారారని.. రత్నప్రభను బిసి (సి) గా గుర్తించాలని.. 1950 రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ కాదని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు.
2007లో మరణించిన రత్నప్రభ అత్తగారు గోన నవమణి శవ పేటికపై ఉన్న శిలాఫలాన్ని చూపిస్తూ రత్నప్రభ ఎస్సీ కాదని ఆమె ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.. ఆమెను తిరుపతి ఎంపీగా అనర్హురాలిని చేయాలని కోరుతున్నారు. రత్నప్రభ అత్తగారి కుమారులు మరియు కుమార్తెల పేర్లు ప్రముఖంగా అందులో ప్రచురించబడ్డాయి. వారంతా కనర్వ్టెడ్ క్రిస్టియన్లు అని ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఎన్వీ రమణ అనే వ్యక్తి అప్పట్లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం-1989 కింద రత్న ప్రభ.. ఆమె కుటుంబం 2012 లో కేసు నమోదు చేశాడు. మియాపూర్‌కు చెందిన రమణ.. రత్న ప్రభ ఎస్సీ కాదని, ఆమె ఎస్సీ సర్టిఫికెట్‌కు విలువ లేదని పేర్కొంటూ కేసు పెట్టారు. అతను ఆమె మతాన్ని నిరూపించడానికి కొన్ని డాక్యుమెంటల్ మరియు కొన్ని ఫొటో ఆధారాలను కూడా సమర్పించాడు. ఆమె బిసి-సి అని.. ఎస్సీ కాదని వాదించాడు.
తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఆమెను ఓడించటానికి ఆమె ప్రత్యర్థులు ఆశ్చర్యకరంగా, ఈ అంశాన్ని లేవనెత్తి ప్రచారం చేస్తున్నారు. ఒక క్రైస్తవుడిని తన అభ్యర్థిగా అంగీకరించినందుకు ప్రత్యర్థులు బిజెపిని ప్రశ్నిస్తున్నారు. బిజెపి నాయకులు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుందని నిలదీస్తున్నారు.
కరుడుగట్టిన హిందుత్వ బిజెపి నాయకత్వం తన అభ్యర్థిగా క్రైస్తవ మతానికి చెందిన వారిని ఎంపిక చేసిందా? అని ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ సమాధానం ఇస్తుందా లేదా రత్న ప్రభా స్వయంగా వారికి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.