2019 లో వరల్డ్ కప్ కు ఎంపికయినప్పటి నుంచి విజయ్‌శంకర్ పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ఎదురవుతున్నాయి. అప్పట్లో తెలుగు వాడైన అంబడి రాయుడిని పక్కకు పెట్టి.. ఆ స్థానంలో విజయ్ శంకర్ ను తీసుకున్నారు. విజయ్ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు రంగాల్లో రాణించగలడని అతడు త్రీడీ ప్లేయర్ అంటూ సెలక్టర్లు ప్రశంసించారు. దీంతో నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు త్రీడీ గ్లాసెస్ ను పెట్టుకొని వెళ్తున్నాను.. అంటూ అంబటి రాయుడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అప్పట్లో సంచలనంగా మారింది.
ఆ తర్వాత విజయ్ శంకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతుండగా.. అంబటి రాయుడు మాత్రం చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. దీంతో వీరిద్దరికీ మధ్య ఎప్పుడూ పోటా పోటీ ఎదురవుతూ ఉంటుంది. రాయుడు మెరుగైన ప్రదర్శన చేసిన ప్రతిసారి విజయ్‌శంకర్ కు ట్రోల్స్ ఎదురవుతుంటాయి. ఇటీవల ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన విజయ్‌శంకర్ పెద్దగా రాణించలేదు. దీంతో త్రీడీ ఆరోపణలు మరోసారి వచ్చాయి.
తాజాగా ట్రోల్స్ పై విజయశంకర్ స్పందించారు. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన పంచుకున్నాడు. ’నేను జాక్వెస్ కలిస్, షేన్ వాట్సన్ లాంటి ఆటగాన్ని.. మూడో స్థానంలో బాగా ఆడగలను. బౌలింగ్ కూడా చేస్తాను. కానీ నన్ను ఐదు, ఆరు స్థానాల్లో దింపుతున్నారు. దీంతో నేను భారీగా పరుగులు చేయలేకపోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.
అయితే నేను ఐదో స్థానంలో కూడా సంతోషంగా ఆడగలను. కానీ అప్పుడు నేను ఎక్కువ పరుగులు చేయలేను. ఎందుకంటే నేను బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ ఓవర్లు ఉండవు. అంతమాత్రం చేత నన్ను ముందుగా పంపించాలి అని నేను ఏమీ డిమాండ్ చేయట్లేదు’ అని అన్నాడు విజయశంకర్.
కొంతమంది ట్రోలర్స్ నా మీద త్రీడీ ట్రోల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే రాయుడు నన్ను 3డీ తో పోల్చుతూ ట్వీట్ పెట్టాక కూడా నేను మెరుగైన ప్రదర్శన ఇచ్చాను. అయినా నా మీద ట్రోల్స్ ఆగడం లేదు. నన్ను రాయుడితో పోలుస్తున్నారు. అతడు ఆడే పరిస్థితులు నేను ఆడే పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. ప్రతిసారి రాయుడితో పోల్చడం సరికాదు. నేను బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ కూడా చేయగలను అన్న విషయాన్ని గుర్తించుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ శంకర్.