కర్ణాటక మంత్రివర్గంలో చిరు హీరోయిన్

Update: 2018-06-10 05:06 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి మంత్రివర్గంలో చిరంజీవి హీరోయిన్ చోటు దక్కించుకుంది. కన్నడ - తెలుగు - తమిళంలో 1980ల కాలంలో హీరోయిన్ గా పాపులర్ అయిన జయమాల కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం కర్ణాటక మంత్రి వర్గంలోనే ఈమె ఏకైక మహిళా మంత్రి కావడం విశేషంగా చెప్పవచ్చు. అంతేకాదు నటిగా చేసిన మంత్రిగా ఎంపికైనా తొలి మహిళ కూడా ఈమె కావడం విశేషం..

జయమాల అప్పట్లో ఫేమస్ హీరోయిన్. ఈమె చిరంజీవితో కలిసి ‘రాక్షసుడు’ మూవీలో నటించింది. ఆ సినిమాలో తారకేశ్వరి పాత్రలో నటించి మెప్పించింది.  రాక్షసుడు సినిమాలోని ‘నీ మీద నాకు ఇదయ్యో’ పాటలో చిరంజీవి-జయమాల డ్యాన్సు అప్పట్లో తెలుగునాట దుమ్ముదులిపింది. మ్యూజికల్ గా ఈ పాట పెద్ద హిట్ అయ్యింది.  

ఈ 62 ఏళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయమాల ‘భామ రుక్మిణీ’ అనే తెలుగు సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి మహిళ శిశుసంక్షేమ శాఖను  జయమాలకు అప్పగించారు. జయమాల నటనకు స్వస్తి చెప్పాక మహిళా హక్కులపై పెద్ద ఎత్తున పోరాడారు. పలు నిరసనలు చేశారు. మహిళల సమస్యలపై పీహెచ్ డీ కూడా చేసి ప్రావీణ్యం సంపాదించారు. ఇప్పుడు ఏకంగా మంత్రివర్గంలో చోటు సంపాదించి ఆశ్చర్యపరిచారు.
Tags:    

Similar News