అగ్రరాజ్యం సాహసం.. ఏంత ప్యాకేజీ తెలుసా?

Update: 2020-05-16 17:30 GMT
కరోనా వైరస్ తో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు నడుం బిగించింది. అగ్రరాజ్యం అమెరికా అదిరిపోయే సాహసం చేసింది. ఏకంగా అమెరికాకు చెందిన ప్రతినిధుల సభలో 3 ట్రిలియన్ డాలర్ల  ప్యాకేజీ బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఈ అతి భారీ ప్యాకేజీ ఉద్దీపన బిల్లుకు అనుకూలంగా 208మంది, వ్యతిరేకంగా 199మంది ఓటేశారు. డెమోక్రాట్లు ప్రతిపాదించిన ఈ బిల్లుకు ఈజీగానే ఆమోదం దక్కింది. అయితే సొంత పార్టీకి చెందిన 14 మంది ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేశారు.

రాష్ట్రాలకు, స్థానిక ప్రభుత్వాలకు నిధులు సమకూర్చుకునేందుకు, కరోనా వైరస్ టెస్టింగ్ కోసం.. నిరుద్యోగులకు నేరుగా డబ్బులు జమ చేసేందుకు ఈ ప్యాకేజీ ప్రతిపాదించినట్టు డెమోక్రాట్లు బిల్లు సందర్భంగా తెలిపారు.

కాగా ప్రతిపక్ష రిపబ్లికన్లు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. మహమ్మారి నేపథ్యంలో రిమోట్ ఓటింగ్ కు అవకాశం కల్పించారు. ఒక వ్యక్తిద్వారా పది మంది ప్రజాప్రతినిధుల ఓటు లేఖలను స్పీకర్ కు అందించే అవకాశం ఉంటుంది.
Tags:    

Similar News