నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్నట్లుగా తెలుగురాజకీయాలు మారి చాలా కాలమే అయ్యింది. సాదాసీదా నేతలు మాట్లాడుకునే మాటల్ని.. ఈ మధ్యన ఉన్నత స్థానాల్లో ఉన్న నేతలు సైతం మాట్లాడేస్తున్నారు. బొత్తగామర్యాద.. గౌరవం లేని రాజకీయాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి.. సీఎం నోటి నుంచి రాకూడని మాటల్ని వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేశారు. తనకున్న దూకుడ్ని ప్రదర్శించారు.
ఇటీవల కాలంలో మాంచి ఊపు మీద ఉన్న సీఎం జగన్.. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో జరిగిన కార్యక్రమానికి హాజరై.. ఆవేశానికి గురై.. తనను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తూ.. ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరంటూ జుట్టులో వేలు పెట్టుకొని మరీ చెప్పటం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ముఖ్యనేత నోటి నుంచి వచ్చిన పీకలేరన్న మాటకు తాజాగా సీనియర్ టీడీపీ నేత.. మంచి వాక్ చాతుర్యం ఉన్న ఆయన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది.
అలాంటి ఆయన తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పీకుడు లాంగ్వేజ్ లో తనకు ప్రతిభను ప్రదర్శించారు. ‘జగన్ రెడ్డీ.. తీవ్రత పెంచాల్సింది భాషలో కాదు.. పాలనలో. పీకుడు భాష మాట్లాడటం మాకు ఇష్టం ఉండదు. మీ భాషలో అడగాలంటే.. పీకుడు భాష మాట్లాడుతున్న మీకు పీకేను పీకే ధైర్యం ఉందా? పీకేని పీకేసి పాలన చేయగలవా? అయినా అసలు మూడేళ్లు ఏం పీకావ్? ఢిల్లీకి వెళ్లింది పీకటానికా? పీకించుకోవటానికా?’’ అంటూ వరుస పెట్టి పీకుడు వ్యాఖ్యలతో ఫైర్ అయ్యారు.
సీఎం జగన్ నోటి నుంచి వచ్చిన పీకలేరన్న మాటకు.. ఏం పీకావ్ అంటూ ప్రశ్నల చిట్టాను విప్పిన పయ్యావుల.. ‘‘పోలవరం ప్రాజెక్టుపై.. అమరావతిలో అవినీతి మీదా.. ప్రత్యేక హోదా మీదా.. కోడి కత్తి కేసు మీదా.. బాబాయ్ హత్య కేసుపైనా సీమ.. ఉత్తరాంధ్రకు ప్రాజెక్టులపై ఏం పీకావ్?’’ అని ప్రశ్నించారు. అదే సమయంలో జగన్ పీకేసిన పలు పథకాల్ని ప్రస్తావించారు. ప్రజావేదికను.. అన్న క్యాంటీన్లను.. కరెంటును.. వ్యవసాయ పని ముట్టపై సబ్సిడీలను.. డప్పు కళాకారులు.. బెస్తవారికి ఇచ్చే ఫించన్లను పీకేశారంటూ జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పాలనతో దిగజారిన ప్రతిష్ఠను కాపాడుకోవటానికి పీకుడు భాషను మాట్లాడారన్న పయ్యావుల.. ముఖ్యమంత్రి స్థాయికి ఏ మాత్రం సూట్ కాని భాషను ఎన్నుకున్నారన్నారు. పీకేనివేదికలు.. నిఘా నివేదికలు జగన్ ఫెయిల్యూర్ ను చూపించాయన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంతమంది మంత్రుల్నిపీకుతారో తాము చూస్తున్నామన్న ఆయన.. పీకే నివేదిక నేపథ్యంలో దాన్ని కవర్ చేయటానికి పీకలేరన్న మాటల్ని మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. చాలా కాలం తర్వాత పయ్యావుల ఫైరింగ్ టీడీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని పెంచిందనిచెప్పక తప్పదు.