కెనడాలోని టొరంటో నగరంలోని సబ్‌వే స్టేషన్ ప్రవేశద్వారం వద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ తుపాకీ కాల్పుల్లో 21 ఏళ్ల భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ మృతిచెందారు. కార్తీక్ తన పనిపై వెళుతుండగా సెయింట్ జేమ్స్ టౌన్‌లోని షెర్బోర్న్ టిటిసి స్టేషన్‌కు గ్లెన్ రోడ్ ప్రవేశద్వారం వద్ద గురువారం సాయంత్రం కాల్పుల్లో మరణించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని టొరంటో పోలీస్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
టొరంటో పోలీస్ సర్వీస్‌కు చెందిన క్రైం స్క్వాడ్ విచారణ చేపట్టింది. ఈ ప్రాంతంలో కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సాక్షులు, డ్రైవర్లు లేదా వ్యాపార సంస్థలతో విచారించారు. "నిన్న టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ దురదృష్టవశాత్తు మరణించినందుకు మేము దిగ్భ్రాంతి చెందాము" అని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో రాసింది.
"కార్తీక్ కుటుంబంతో టచ్ లో ఉన్నామని.. మృత దేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంలో సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తాము" అని ఇండియన్ కౌన్సిల్ లో తెలిపింది.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. “ఈ విషాద సంఘటనతో బాధపడ్డాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి' అని జైశంకర్ ట్వీట్ చేశారు. కార్తీక్ సెనెకా కాలేజీలో మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం విద్యార్థr. సబ్‌వేలో తన ఉద్యోగానికి వెళుతుండగా హత్యకు గురయ్యాడు. జనవరిలో కెనడా వెళ్లాడు’ అని తెలిపారు.
ప్రస్తుతానికి కాల్పులు జరిపిన అనుమానితుడు ఐదు అడుగుల ఆరు నుండి ఐదు అడుగుల ఏడు అంగుళాల పొడవుతో మధ్యస్థంగా ఉండే నల్లజాతి వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం తుపాకీని చేతబట్టి గ్లెన్ రోడ్‌లో హోవార్డ్ స్ట్రీట్ వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు తెలిపాడు..