ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పదవులు చేపట్టిన వారికి చిత్రమైన సమస్య ఎదురైంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తవారు తమకు కేటాయించే ఛాంబర్ల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముందే ఏర్పాట్లు చేయకపోవడంతో మంత్రులు నిరీక్షిస్తున్నారు. కొత్త ఛాంబర్లు సిద్ధం కావడానికి కనీసం 15 రోజులు పడుతుందని సాధారణ పరిపాలక శాఖ స్పష్టం చేసింది. దీంతో నిరీక్షణ తప్పడం లేదు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం వైపు నుంచి ఈ సమస్యకు పరిష్కారం సూచిస్తున్నట్లు సమాచారం. వెలగపూడి సచివాలయంలోని బ్లాకుల్లో కాన్ఫరెన్స్ హాళ్లను ప్రభుత్వం రీమోడలింగ్ చేసి నూతన మంత్రులకు ఛాంబర్లుగా కేటాయించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ మరో పదిహేను రోజుల్లో కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, సచివాలయ నిర్మాణంలో భవిష్యత్ అవసరాలు పరిగణలోకి తీసుకోలేదంటూ పలువురు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవసరాల ప్రాతిపదికన చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/