చైనాలోని ఐదు నగరాలు (వూహాన్, హువాంగాంగ్, జియాంటావో, చిబి, మరో నగరం) రెండు కోట్ల మంది కంటే ఎక్కువ ప్రజలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. ఏమైనా బయటకు వచ్చినా.. ముఖానికి మాస్కులు పెట్టుకోవటమే తప్పించి మామూలుగా రాలేదు. ఈ ఐదు నగరాలకు చెందిన ప్రజలు ఇప్పుడు వారి ఊరి నుంచి మరే ఊరికి వెళ్లలేరు. అలా హౌస్ అరెస్టు కావటానికి కారణం.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్. ఈ వైరస్ ను నియంత్రించేందుకు మందులు లేని వేళ.. ఈ వైరస్ వ్యాప్తి చెందితే దాన్ని కంట్రోల్ చేయటం కష్టమవుతుందన్న ముందుజాగ్రత్తలో బాగంగా.. ఈ నగరాలతో మిగిలిన నగరాల రాకపోకల్ని బంద్ చేశారు.
కరోనాగా పిలిచే ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని మూలం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా ఈ వైరస్ కు 2019-ఎన్ సీవోవీ పేరుతో నామకరణం చేశారు. కరోనా వైరస్ ను విశ్లేషించటానికి.. ఈ వైరస్ జన్యుక్రమాన్ని లెక్క తేల్చే ప్రయత్నంలో పలువురు శాస్త్రవేత్తలు పడ్డారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని చైనా పలు సంస్థలకు అందజేసింది.
ఇప్పటివరకూ విశ్లేషించిన దాని ప్రకారం కరోనా వైరస్ లో చాలా రకాలు ఉన్నాయని.. అందులో సాధారణ జలుబు నుంచి ప్రాణాంతక సార్స్ వరకూ రకరకాల జబ్బులకు కారణమయ్యే వైరస్ కుటుంబంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతానికి వణికిస్తున్న ఈ వైరస్ కరోనా కుటుంబానికే చెందినా.. ఇది ఇంతకు ముందెప్పుడూ చూడలేదంటున్నారు. వివిధ జీవుల్లోని వైరస్ తో పోల్చినప్పుడు గబ్బిల్లాల్లో కనిపించే రకం కరోనా వైరస్ తో పోలిక ఉంది. మరో గుర్తు తెలియని జీవిలోని వైరస్ తో కలిసి ఈ కొత్త వైరస్ ఏర్పడి ఉంటుందని పెకింగ్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. గుర్తు తెలియని ఆ రెండో జీవి పాము అయ్యే అవకాశం ఉందంటున్నారు.
సార్స్ తో పోలిస్తే ఈ వైరస్ తీవ్రత తక్కువేనని చెబుతున్నా.. కోట్లాది మంది ఈ వైరస్ కారణంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయంలో ఇప్పటికే ఇదెక్కువగా ఉన్న ఐదు నగరాల్లో రాకపోకల్ని పూర్తిగా బంద్ చేసిన చైనా ప్రభుత్వం.. ఈ వైరస్ కు విరుగుడు కనుగునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.