ఏపీలో వైరస్ తీవ్రస్థాయిలోనే విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా వెయ్యికి రెండు తక్కువ 998 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. పాజిటివ్ కేసులలో ఏపీకి చెందిన వారు 961 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఒక్కరోజే 14 మంది మృత్యువాత పడ్డారు.
కొత్త వాటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు 18,697 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వరకు 232 మంది మృతి చెందారు. తాజాగా 391 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. యాక్టివ్ కేసులు 10,043 ఉన్నాయి. వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 8,422 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే టెస్టుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 10,17,140 మందికి పరీక్షలు నిర్వహించారు.