ఏపీని కరోనా కమ్మేస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే ఏపీలో కొత్తగా 7627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 96298కి చేరింది.
24 గంటల్లో ఏపీలో 47645 శాంపిల్స్ ను టెస్ట్ చేయగా..7627 కేసులు బయటపడ్డాయి. ఇందులో యాక్టివ్ కేసులు 48956 కాగా.. 46301మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా ఏకంగా 56మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1041కి చేరింది.
నిన్న ఒక్కరోజే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 1095, పశ్చిమ గోదావరిలో 859 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లాలో ఏపీలోనే అత్యధికంగా 13486 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.