వైరస్ విజృంభణ తెలంగాణలో జోరందుకుంటోంది. ఆ వైరస్ అత్యధికంగా హైదరాబాద్ లోనే విస్తరిస్తోంది. దీంతో హైదరాబాద్ లో వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 127 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు వైరస్ తో మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,147కి చేరిందని గురువారం వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో వైరస్‌తో ఆరుగురు మృతిచెందడంతో మృతుల్లో తెలంగాణ వంద మార్క్‌ను దాటేసింది. ఇప్పటివరకు సంభవించిన మరణాలు 105.
తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 110 - రంగారెడ్డిలో 6 - ఆదిలాబాద్ జిల్లాలో 7 - మేడ్చల్ 2 - సంగారెడ్డి - ఖమ్మం జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయి. ఆ వైరస్ నుంచి కోలుకున్నవారు మొత్తం 1,587 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,455 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నాలుగు రోజుల్లోనే 23 మంది మృత్యువాత పడడంతో పరిస్థితి ఆందోళన రేకితిస్తోంది. . రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ ఉధృతి మరింత పెరుగుతోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.