కరోనా వేళ.. కొత్త చోట టాయిలెట్లు వాడుతున్నారా? జర జాగ్రత్త

Update: 2020-08-21 01:30 GMT
అనునిత్యం అప్రమత్తంగా ఉండటమే కాదు.. వేసే ప్రతి అడుగు ఆచితూచి అన్నట్లు ఉండాల్సిందే. లేకుంటే.. ఏ క్షణంలో అయినా కరోనా సోకే ప్రమాదం పొంచి ఉంది. దేశవ్యాప్తంగా అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. ఈ వైరస్ వ్యాప్తికి ఉన్న అవకాశాల మీద పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఒక కొత్త విషయాన్ని గుర్తించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త చోట్ల బాత్రూం వాడేటట్లైయితే.. మరింత కేర్ ఫుల్ గా ఉండాలని చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

టాయిటెల్లకు వెళ్లిన తర్వాత ఫ్లషింగ్ కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతుందన్న విషయాన్ని తాజాగా గుర్తించారు. పబ్లిక్ టాయిలెట్లలో మూత్ర విసర్జన తర్వాత ఫ్లషింగ్ చేసినప్పుడు.. తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉందని తేల్చారు. చైనాలోని యాంగ్జౌ వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ కారణంతోనే.. బాత్రూంలోనూ మాస్కులు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు.

ఈ విషయాన్ని ఫిజిక్స్ అండ్ ఫ్లైయిడ్స్ జర్నల్ లో ప్రచురించారు. బాత్రూంలోని ఫ్లషింగ్ కారణంగా మూత్రం..దాని నీటి రేణుల్లోని వైరస్ 57 శాతానికి పైగా చుట్టుపక్కల వ్యాపిస్తోందని గుర్తించారు. పబ్లిక్ ప్లేస్ లలో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసే సమయంలో ఆ రేణువుల ద్వారా వైరస్ 5.5 సెకన్లలోనే తొడల వరకు వ్యాపిస్తోందని తేల్చారు.

ఈ నేపథ్యంలో జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని బాత్రూంల వద్దకే కాదు..ఆ దరిదాపుల్లోకి వెళ్లటం కూడా జాగ్రత్తగా ఉండటం అవసరమని చెప్పక తప్పదు. ఫ్లషింగ్ చేసే సమయంలో వైరస్ 35 సెకన్ల వ్యవధిలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ప్రయాణిస్తుందని తేల్చారు. ఈ నేపథ్యంలో వాష్ రూంలోకి వెళ్లే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించటం చాలా అవసరం. సో.. బీ కేర్ ఫుల్.
Tags:    

Similar News