కరోనా మహమ్మారి చేయబట్టి ఏ రోగమొచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రాణ భయానికి వైద్యులు, నర్సులు కూడా ఎవరినీ చూడడం లేదు. తప్పనిసరి అయితేనే చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇెక కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ నిండిపోవడంతో సాధారణ జబ్బులకు.. అత్యవసర వైద్యం అవసరమయ్యే వారికి కనాకష్టంగా మారుతోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైతే పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కేసుల వల్ల పడకలు ఖాళీగా లేవు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి ఆరోగ్యం బాగా లేక కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
సమయానికి వైద్యుడు కూడా అందుబాటులో లేడు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అక్కడున్న నర్సు ఆ బాధితుడిని కరోనా రోగులకు దూరంగా ఆటోలో ఉంచి చికిత్సనందించింది. రోగికి గ్లూకోజ్ పెట్టి దానిని తగిలించేందుకు స్టాండ్ లేకపోవడంతో అతడి కుమార్తెను ఆ గ్లూకోజ్ సీసా పట్టుకోమంది. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఏమీ తోచని ఆ పేద కుటుంబం కాసేపు అక్కడే చికిత్స పొందింది. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఈ దైన్యం అందరినీ కలిచివేసింది.