తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా విలయతాండవం..!

Update: 2020-08-14 11:50 GMT
తెలంగాణ పోలీసు శాఖలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా విజృంభణ మొదలైన సమయం నుండి లాక్ ‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుండి కరోనాను అరికట్టడంతో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న  పోలీసు సిబ్బంది కరోనా  బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా  హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండంటంతో.. పోలీసులకు ప్రత్యేకంగా పరీక్షలు చేస్తున్నాయి.  

తెలంగాణలో ఇప్ప‌టివ‌ర‌కు 4259 మంది పోలీసులు క‌రోనా బారిన ప‌డ్డారు. ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్‌ లో ప‌నిచేసే 1946 మంది పోలీసుల‌కు క‌రోనా సోకింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనాతో 39 మంది పోలీసులు మృతి చెందారు. అందులో హైద్రాబాద్ కమీషనరేట్ పరిధిలోనే ‌లోనే 26 మంది వ్యాధి బారిన ప‌డి మృతి చెందారు. ఆ తర్వాత వరంగల్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో పోలీసులు ఎక్కువ‌గా క‌రోనా బారిన ప‌డ్డారు. వాహనాలను ఆపిన సమయంలో పోలీసులు అతి దగ్గర నుంచి వారితో మాట్లాడాల్సి రావడం కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది. దీంతో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ,   పోలీసుల్లో మోర‌ల్ సపోర్ట్ నింపేందుకు వ్యాధి బారిన ప‌డి..రిక‌వ‌ర్ అయిన వారిని ఘ‌నంగా తిరిగి విధుల్లోకి ఆహ్వానిస్తున్నారు.

ఇక, తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1920 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 88,396కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 674కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1210 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 64,284కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 23,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి


Tags:    

Similar News